కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయాలను ఎప్పుడు లేనంత హీట్ ను తలపిస్తున్నాయి. ప్రత్యర్థులకు చిక్కకుండా వారికి చుక్కలు చూపిస్తూ ఎవరికీ అంతు చిక్కని ఎత్తుగడలు వేస్తూ రాజకీయ చదరంగం లో వేగంగా వ్యూహాలు రచిస్తున్నాడు. కేసీఆర్  90శాతం కేండిడేట్ ల జాబితా ప్రకటించడం అంటే ఏమనుకోవాలి? దానికి ఎంత ధైర్యం కావాలి? అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికే ధైర్యం కావాలి. సాధారణంగా ఇలాంటి తెగువ, తెగింపు నిర్ణయాలు రాజకీయాల్లో బెడిసి కొట్టినవే ఎక్కువ. అయినా కేసీఆర్ ధైర్యంగా ముందుకు వెళ్లడానికి డిసైడ్ అయ్యారు.

Image result for kcr

అందుకు ఆయన కాస్త ముందుగానే కసరత్తు ప్రారంభించారని అర్థం అయిపోతూనే వుంది. అందుకు తగినట్లుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అభ్యర్థుల జాబితా ఇవ్వాళ ప్రకటించారు అంటే, దీనికి కేసీఆర్ ఎన్నాళ్ల నుంచి హోమ్ వర్క్ చేస్తున్నారో? అది చాలా కీలకం. రెండవది, నామినేషన్ల టైమ్ లో తప్ప జాబితా ప్రకటించడానికి ధైర్యం చాలదు రాజకీయ పార్టీలకు. లాస్ట్ మినిట్ వరకు కేండిడేట్లు ఎవరు అన్నది దాస్తూ వస్తారు. ఎందుకంటే ఒకటి పార్టీలో అంతర్గత వివాదాలు, పోటీలు, అసంతృప్తులు వగైరా వ్యవహారాలు వుంటాయి. రెండు పోటీ పార్టీలు జాగ్రత్త పడిపోతాయి.

Image result for kcr

ఇవన్నీ అపార రాజకీయ అనుభవం వున్న కేసీఆర్ కు తెలియని సంగతులు కావు. అయినా ఇలా ప్రకటించారు అంటే ఆయన తెగువ మెచ్చుకోదగ్గదే. ఇప్పడు టికెట్ లు ఆశించి రాని వారికి బోలెడు చాన్స్ లు వున్నాయి. భాజపా, కాంగ్రెస్, తెలుగుదేశం. మూడు ఆప్షన్లు వుంటాయి. ఆయా పార్టీలు కూడా ఈ అభ్యర్థుల జాబితాను చూసుకుని, వాటికి సరైన కౌంటర్ అభ్యర్థులను వెదుక్కుంటాయి.  కానీ కేసీఆర్ ఆలోచన వేరు. ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల వెదుకులాటలో వుండగానే, ఆయన ప్రచారానికి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ కానీ, భాజపా కానీ అభ్యర్థులను ప్రకటించడం అంత సులవుకాదు. ఎందుకంటే వాటికి జాతీయ అధిష్టానాలు వుంటాయి. వడపోతలు వుంటాయి. ఇతరత్రా వ్యవహారాలు వుంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: