తెలంగాణా అసెంబ్లీ రద్దు అయింది. అలా రద్దు చేసే అధికారం అక్కడ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కేసీయార్ ప్రభుత్వానికి రాజ్యాంగపరంగా దక్కిన అధికారం. అంతవరకూ ఓకే...కానీ ఆ తరువాత కధ కేసీయార్ చేతిలో లేదు. ఇపుడు నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే బంతి అక్కడ ఉందన్న మాట.


వినతి వరకేనా :


కేసీయార్ సర్కార్ సభను రద్దు చేస్తూ సత్వరమే ఎన్నికలు జరిపించాలని కోరడం వరకే పరిమితం కావాలి. నిబంధనలు చూసినా అదే చెబుతున్నాయి. అంతే తప్ప కేసీయార్ చెబుతున్నట్లుగా నవంబర్లో ఎన్నికలు, డిసెంబర్లో ఫలితాలు అన్నది ఆయన అధికార పరిధి కానే కాదన్న విమర్సలు వస్తున్నాయి. వేగంగా ఎన్నికలు జరిపించమని మాత్రమే కేసీయర్  ఈసీకి వినతి చేసుకోగలరు. అంతకంటే చేసేదేమీ లేదు.


అక్కడే ఫైనల్  :


ఏ రాష్త్రంలోనైన సభ రద్దు చేసినపుడు ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలు జరిపించాలని రాజ్యాంగం చెబుతోంది. అలా చూసుకున్నపుడు వచ్చే ఏడాది మార్చి నెల మొదటి వారం లోపల ఎపుడైనా ఈసీ ఎన్నికలు జరిపించవచ్చు. రాజ్యాంగంలోని 174-1వ అధికరణం నిర్దేశనం మేరకు శాసన సభల ఎన్నికల నిర్ణయాఢికారం పూర్తిగా ఈసీ పరిధిలోనిది.


జమిలి తప్పదా :


అలా కనుక చూసుకుంటే లోక్ సభ ఎన్నికలు రెండు నెలలు ముందుకు జరిపి, ఆంధ్రప్రదేశ్,ఒడిషాతో సహా మిగిలిపోయిన రాష్ట్రాల ఎన్నికలతోనే తెలంగాణా ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిపించే అవకాశాలనూ కొట్టి పారేయలేము. అదే జరిగితే  కేసీయార్ ఆరు నెలల పాటు అధికారం లేని ఉత్సవ సీఎం అయిపోతారు. ఇపుడు ఈసీ పరిధిలోని వ్యవహారం కాబట్టి కేసీయార్ కూడా ఏమీ చేయలేరు. మరి ఈసీ ఎలా రియాక్ట్ అవుతుందన్నది చూదాలి



మరింత సమాచారం తెలుసుకోండి: