తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీయార్ తన ఎత్తులతో అసెంబ్లీ ఎన్నికలను తొమ్మిది నెలల ముందుకు తీసుకువచ్చారు తనకు అనుకూలంగా రాజకీయ పావులను వేసేందుకు కేసీయార్ ఇలా చేశారన్నది అందరికీ తెలిసిందే. మరి అదే రాజకీయ ఎత్తులు పై ఎత్తులలో ముదిరిపోయిన మోడీ, షా టీం ఇపుడేం చేస్తుంది. ఇది అందరి మదిలో దొలిచే ప్రశ్న.


చాన్స్ ఇస్తారా :


కేసీయార్ కోరుకుంటున్నట్లుగా నవంబర్లో ఎన్నికలు జరిపించే విషయంలో కేంద్రం వైఖరి ఏంటన్నది ఇక్కడ ప్రధానంగా చూడాలి. నిజానికి ఎన్నికల నిర్వహణ కేంద్రం పరిధిలో కాకపోయినా కేంద్రంలోని పాలకుల పలుకుబడిని తేలిగ్గా కొట్టిపారేయలేం. అలా చూసుకున్నపుడు కేసీయార్ కి అనుకూలంగా జరిగే రాజకీయ ఎన్నికల ప్రక్రియను  మోడీ అండ్ కో సాగనిస్తుందా అన్నదే డౌట్.


నమ్మలేమంటున్నారు :


కేసీయార్ ను నమ్మలేమని తెలంగాణా బీజేపీ నాయకులు మోడీ, షా చెవిలో పోరుతూ  గట్టిగానే చెబుతున్నారు. అప్పట్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తానని చెప్పి తెలంగాణా వచ్చాక ప్లేట్ ఫిరాయించిన వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇపుడు అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరిపించుకుని, లోక్ సభ నాటికి కేసీయార్ వేరే రూట్లోకి వెళ్తే కేంద్ర బీజేపీ పెద్దలు ఏం చేయగలరన్నది వారు లేవనెత్తుతున్న సందేహం. ఇది నిజం కావచ్చు కూడా.


షాక్ ఇస్తారా :


అందువల్ల ఎటూ కేసీయార్ నిర్ణయం (అసెంబ్లీ రద్దు) ఆయన తీసేసుకున్నారు. ఇపుడు ఎన్నికలు జరిపించే విషయంలో మోడీ, షా పాత్రను తక్కువ అంచనా వేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లోక్ సభ ఎన్నికలు కాస్త ముందుకు జరిపి ఫిబ్రవరిలో పెట్టుకుని దానితో పాటే తెలంగాణాను తెస్తే కేసీయార్ తో రాయబేరాలకు బీజేపీకి చాన్స్ ఉంటుందన్నది కమల నాధుల వ్యూహకర్తల మాట. 
అదే నిజమైతే కేసీయార్ కోరుతున్న ముందస్తు రాదు, మోడీ, షా చెబుతున్న జమిలి ఎన్నికలే వస్తాయి. మరి అదే జరిగితే కేసీయర్ కి పెద్ద షాకే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: