Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Feb 20, 2019 | Last Updated 3:16 pm IST

Menu &Sections

Search

కాంట్ర‌వ‌ర్సీ కింగ్‌ల‌కూ.. కేసీఆర్ టిక్కెట్ల స్టోరీ ఇదే

కాంట్ర‌వ‌ర్సీ కింగ్‌ల‌కూ.. కేసీఆర్ టిక్కెట్ల స్టోరీ ఇదే
కాంట్ర‌వ‌ర్సీ కింగ్‌ల‌కూ.. కేసీఆర్ టిక్కెట్ల స్టోరీ ఇదే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కేసీఆర్ ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌డ‌ని అన‌డానికి ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నం మ‌రోటి లేదు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు చేయ‌డం.. ఏకంగా 105మంది పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం రాజ‌కీయ సంచ‌ల‌నంగా మారింది. అయితే మొద‌టి నుంచి కూడా కేసీఆర్ ఒక విష‌యం మాత్రం చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక‌రిద్ద‌రికి త‌ప్ప సిట్టింగులంద‌రికీ టికెట్లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే.. ఇదే స‌మ‌యంలో కేసీఆర్ చెప్పిన‌ట్లు సిట్టింగులంద‌రికీ టికెట్లు ఇవ్వ‌ర‌నీ.. దాదాపుగా ఈసారి 30మంది వ‌ర‌కు టికెట్లు ద‌క్క‌వ‌నే ప్రచారం జ‌రిగింది. ఎందుకంటే.. ప‌లు జిల్లాల్లోని సిట్టింగు ఎమ్మెల్యేలు అనేక వివాదాల్లో చిక్కుకోవ‌డమే కార‌ణం. వాళ్ల‌కు టికెట్లు ఇవ్వ‌ర‌నే టాక్ బ‌లంగా వినిపించింది.

telangana-trs-cm-kcr-mla-tickets-anouncement-contr

 కానీ.. ఊహాగానాల‌ను కేసీఆర్ చెక్ పెట్టారు. వివాదాస్ప‌ద ఎమ్మెల్యేల‌కు కూడా టికెట్లు ఇచ్చి.. అంద‌రినీ షాక్‌కు గురి చేశారు.  ముందస్తు ఎన్నికలకు వెళ్లే వ్యూహంలో భాగంగా తెలంగాణ‌ అసెంబ్లీని రద్దు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు 105 మంది అభ్యర్థులతో కూడిన టీఆర్‌ఎస్‌ జాబితాను ప్రకటించారు. దాదాపుగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ ఈ జాబితాలో చోటు దక్కింది. ఇద్ద‌రికి మాత్రం టికెట్లు ఇచ్చేందుకు నిరాక‌రించారు. అందోల్ ఎమ్మెల్యే బాబూమోహ‌న్‌, చెన్నూరు ఎమ్మెల్యే న‌ల్లాల ఓదేలుకు టికెట్లు ఇవ్వ‌లేదు. అదేవిధంగా ప‌లువురి పేర్ల‌ను పెండింగ్‌లో పెట్టారు. ఇందులో వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

telangana-trs-cm-kcr-mla-tickets-anouncement-contr

 అదే స‌మ‌యంలో ప‌లు వివాదాల్లో ఉన్న నేతలకు కూడా టికెట్‌ ఖారారు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భూ వివాదంలో చిక్కుకున్న ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా జనగామ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మరో అవకాశమిచ్చారు కేసీఆర్‌. ఇక‌ జర్మనీ పౌరసత్వం విషయంలో చట్ట పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా వేములవాడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ను అభ్యర్థిగా ప్రకటించి అంద‌రినీ ఆశ్చర్యపరిచారు.
telangana-trs-cm-kcr-mla-tickets-anouncement-contr

వీరితో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంథ‌ని ఎమ్మెల్యే పుట్ట మధు, క‌లెక్ట‌ర్‌తో అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన‌ మానుకోట ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలకు కూడా అవకాశమిచ్చారు. ఇక, కాంగ్రెస్‌ నేత డీకే అరుణ సోదరుడు చిట్టం రామ్మోహన్‌ రెడ్డికి మక్తల్‌ నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు. 



telangana-trs-cm-kcr-mla-tickets-anouncement-contr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.