Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Apr 19, 2019 | Last Updated 4:10 pm IST

Menu &Sections

Search

ఆ లీడ‌ర్ వ‌ల్లే వైసీపీలో విభేదాలు..!

ఆ లీడ‌ర్ వ‌ల్లే వైసీపీలో విభేదాలు..!
ఆ లీడ‌ర్ వ‌ల్లే వైసీపీలో విభేదాలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆనం రామ‌నారాయ‌ణ‌ రెడ్డి రెండు రోజుల కింద‌ట వైసీపీలోకి చేరిన సీనియ‌ర్ మోస్ట్ రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ మంత్రి. నెల్లూరు రాజకీయాల‌పై గ‌ట్టి ప‌ట్టున్న నాయ‌కుడు కూడా ఆయ‌నే. అయితే, ఆయ‌న నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా టీడీపీలోనే ఉండి.. అక్క‌డ టికెట్‌పై గ్యారెంటీ లేక పోవ‌డంతో ఇప్పుడు వైసీపీలో చేరార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇవెలా ఉన్న‌ప్ప‌టికీ... ఇప్పుడు ఆనం రాక‌తో.. వైసీపీలో విభేదాలు భ‌గ్గుమంటున్నాయ‌నే విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా నెల్లూరులోని వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయ‌ని అంటున్నారు. అయితే, దీనిలో ఎంత నిజం అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. నైతికంగా ఆనంను, ఇటు వైసీపీని దెబ్బ‌తీసేందుకు జ‌రుగుతున్న కుట్ర‌లో భాగంగానే దీనిని భావించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

andhrapradesh-tdp-ysrcp-jenasena-cm-chandrababu-na

విష‌యంలోకి వెళ్తే..  వైసీపీలో ఆనం చేరికను మేకపాటి వర్గం విభేదించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న‌ చేరిక కార్యక్రమానికి దూరంగా ఉండగా, తాజాగా ఆ పార్టీ అధినేత జగన్‌ విశాఖలో నిర్వహించిన తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ సమావేశానికి వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి గైర్హాజరయ్యారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరడం, ఆయనకు వెంకటగిరి స్థానాన్ని కేటాయిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడంపై బొమ్మిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. నాలుగేళ్లుగా వెంకటగిరి నియో జకవర్గ ఇన్‌చార్జిగా ఉంటున్న తనకు అధిష్ఠానం కనీస విలువ ఇవ్వలేదన్న ఆవేదనలో ఆయన ఉన్నట్లు విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. 

 andhrapradesh-tdp-ysrcp-jenasena-cm-chandrababu-na

వాస్త‌వానికి వెంకటగిరి సీటుపై జ‌గ‌న్ అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ అనధికారికంగా ఆనంకు ఓకే చేస్తూ సంకేతా లు ఇవ్వడంతో ఇప్పుడీ ర‌గ‌డ ఎందుకు?  అనేది ప‌రిశీల‌కుల మాట‌. వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. గెలుపు గుర్రాల‌కే అవ‌కాశం ఇవ్వాల‌ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ కూడా ఇదే నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌కాశం ఇవ్వ‌వ‌చ్చ‌నేది ఆయ‌న ప్ర‌ణాళిక‌.