Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 8:18 am IST

Menu &Sections

Search

సినిమాలకు నేపధ్యంగా 'వినాయక చవితి కథ'

సినిమాలకు నేపధ్యంగా 'వినాయక చవితి కథ'
సినిమాలకు నేపధ్యంగా 'వినాయక చవితి కథ'
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 వినాయక చవితి భారతీయ పండుగలలో అతి ముఖ్యమైనది. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాథ లలో శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా ప్రకటించిన రోజు. వినాయకుని జ్ఞానానికి, సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడు, లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం. 
ganesh-india-news-vinayaka-vchaviti-telugu-silver-screen-
ఈ పండుగ బాధ్రపదమాసంలో శుక్ల చతుర్థి ప్రారంభమవుతుంది. ఈ పండుగ 10 రోజుల పాటు అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది. ఈ నెల 13 వ తారీఖున వినాయక చవితి పర్వదినం. (చందమామ వృద్ధిచెందే 4వ రోజు నుండి 14 వ రోజు వరకు పర్వదినాలు.
ganesh-india-news-vinayaka-vchaviti-telugu-silver-screen-

నేటి వినాయక చవితి పండుగ లోని పౌరాణిక నేపధ్యం:   

గజరూపము కల రాక్షసుడొకడు పరమ శివుని అనుగ్రహం కోసం ఘోరమైన తపస్సు చేసాడు. భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతని తపస్సుకు మెచ్చి 'భక్తా! ఏమి నీ కోరిక?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరము నందే నివసించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించ సాగాడు.


కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా వేదన చెంది తన సోదరుడు శ్రీమహా విష్ణువును ప్రార్థించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఎదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడ వలసింది' అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.
ganesh-india-news-vinayaka-vchaviti-telugu-silver-screen-
ఆ గజరూప రాక్షసుని ఉదరంలో చేరిన ఆ మహాశివుని విడిపించాలంటే ఆ రాక్షసుని ఉధరం చీలచవలసి ఉంటుంది. దీనికి శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా భావించి నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాదిదేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి, గజాసురపురానికి వెళ్ళి గజాసురుని సమక్షంలో గంగిరెద్దు సన్నాయి వాయిస్తూ , చిత్ర విచిత్రంగా ఆడించారు. 


దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది మహ శివుని వాహనమైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు గజాసురుడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకపూజ్యమయ్యే వరం అనుగ్రహించి, నా చర్మమును నీ వస్త్రముగా ధరించమని' వేడుకొన్నాడు. అభయమిచ్చిన తరువాత, విష్ణుమూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చగా, ఆ గర్భం నుండి బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి 'ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకు ఇలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది' అని చెప్పి అంతర్ధానమయ్యాడు 
ganesh-india-news-vinayaka-vchaviti-telugu-silver-screen-
ఇక్కడ గజాసుర శిరస్సు లోక పూజ్యం అయిన విధం: 

కైలాసములో పార్వతీ దేవి శివునిరాక గురించి విని, చాలా సంతోషించి, అభ్యంగన స్నానమాచరించటానికి నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగు తో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ నలుగు బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వవద్దని చెప్పింది. ఆతరవాత ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ బాలుని ధిక్కారానికి ఆగ్రహించిన పరమశివుడు అతని శిరచ్ఛేదముగావించి లోపలికి వెళ్లాడు.

అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతి దేవుడు శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. ఆ మహాశక్తి శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, తను తన వెంట తెచ్చిన గజాసుర శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. ఆ గజాననుని శిరస్సు పార్వతీ పరమేశ్వరుల ముద్దుల కుమారుని శిరస్సు గా మారి ఆయన్ను 'గజాననుడు'గా మార్చి లోక పూజ్యమైనది. 


గజాననుని వాహనం అనింద్యుడు అనబడే మూషికం. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతని వాహనము నెమలి. అతను మహా బలశాలి. దేవతలంతా "ఏ పనిచేసినా విఘ్నం రాకుండా తమను రక్షించటానికి ఒక దేవుడిని కనికరించమని" పరమ శివుని కోరగా  ఆ పదవికి గజాననుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీపడతారు. 

ganesh-india-news-vinayaka-vchaviti-telugu-silver-screen-
ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, "మీలో ఎవరైతే ముల్లోకములలోని అన్ని పుణ్యనదులలో స్నానంచేసి ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హత గలవారౌతారు" అని అన్నాడు. దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి పుణ్యనదులలో స్నానం చేసి రావటానికి వెళ్లిపోయాడు. గజాననుడు మాత్రం చిన్న బోయిన ముఖంతో 'తండ్రీ! నా బలాబలాలు తెలిసీ మీరిలాంటి షరతులతో పోటీ పెట్టటం సబబేనా? నేను మీ పాద సేవకుడిని కదా! నా మీద దయ తలచి ఎదైనా తరుణోపాయం చెప్ప" మని కోరాడు. అంతట శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు.
 

'సకృన్‌ నారాయణే త్యుక్త్వా పుమాన్‌ కల్పశత త్రయం! గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక!'


కుమారా! ఇది నారాయణమంత్రం! ఇది ఒకసారి జపిస్తే మూడువందల కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్టవుతుంది. షరతు విధించిందీ తండ్రే, తరుణోపాయం  చూపిందీ తండ్రే కాబట్టి, ఇంక తాను గెలవగలనో లేదో, కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను? అని సందేహించకుండా, ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచూ, మూడు మార్లు తల్లి దండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసములోనే ఉండి పోయాడు.
ganesh-india-news-vinayaka-vchaviti-telugu-silver-screen-
అక్కడ కుమారస్వామికి, మూడు కోట్ల యాభై ఒక్క నదులలో, ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు. అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అన్నగారు, తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యము ఇవ్వండీ అన్నాడు.
ganesh-india-news-vinayaka-vchaviti-telugu-silver-screen-
ఆ విధంగా బాధ్రపద శుద్ధచవితి రోజు గజాననుడు, విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు అన్ని దేశాలలోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకములైన పిండివంటలు, కుడుములు, ఉండ్రాళ్ళు, అపూపములు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపళ్లు, పానకము, వడపప్పు సమర్పించగా విఘ్నేశ్వరుడు, తృప్తిపడి తిన్నంత తిని, తన వాహనానికి పెట్టి, తీసుకెళ్ల గలిగి నంత తీసుకుని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరు కున్నాడు. ఎప్పటిలాగా తల్లి దండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు. చేతులసలు నేల కానితేనా ? పొట్ట వంగితేనా ? అలా విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే, శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపకా నవ్వాడు. చంద్రుని చూపుసోకి వినాయకుని పొట్టపగిలి కుడుములన్నీ దొర్లుకుంటూ బయటకు వచ్చేసాయి.


పార్వతి దుఃఖించుచూ, చంద్రుని 'ఓరి పాపాత్ముడా! నీ చూపు తగిలి నా కుమారుడు మరణించాడు. అందుకని నిన్ను చూసినవాళ్లు, పాపాత్ములై నీలాపనిందలు పొందు తారని శపించింది. తరవాతెలాగు దెవతల ప్రార్ధనతో మన్నించి పార్వతీదేవి తన శాపానికి కొన్ని సవరణలు చేయగా జరిగిన చరిత్రలే-మన వెడితెరకు దృశ్య రూపాలై చలన చిత్రాలైనాయి.అవే:

ganesh-india-news-vinayaka-vchaviti-telugu-silver-screen-


*ఋషి పత్నులకు నీలాపనిందలు

*సత్యభామ కథనంతో శమతోపాఖ్యానం - 

*వినాయక విజయం

*వినాయక చవితి 

*భూకైలాస్

లాంటి సినిమాలకు విగ్నేశ్వరుని చరిత్ర నేపధ్యంగా ఉండి కోట్లరూపాయల పంట నిర్మాతలకు పండించింది. 

ganesh-india-news-vinayaka-vchaviti-telugu-silver-screen-

ganesh-india-news-vinayaka-vchaviti-telugu-silver-screen-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రియాంక రాజకీయ ప్రవెశం పై నరేంద్ర మోడీ వ్యాఖ్యలు షాకింగ్!
ప్రియాంక గాంధి వాద్రాని రాజకీయాల్లోకి తెస్తూ కాంగ్రెస్ తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించినట్లేనా? ప్రశాంత్ కిషొర్ షాకింగ్ కామెంట్
భారత రాజ్యాంగం ఓరిజినల్ ఎక్కడ ఉందో తెలుసా?
రాజకీయాల్లో రూటు మార్చిన వైఎస్ జగన్? మున్ముందు బాబుకు దెబ్బే!
"దగా! దగా! కుట్ర" పాటపై పిఠాపురంఎమెల్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యం - 3 వారాలకు వాయిదా: హైకోర్ట్
డేరింగ్ & డాషింగ్ లో మహెష్ బాబు కృష్ణతో పోటీ పడలేడా!
టిడిపి కొంప ముంచనున్న చంద్రబాబు తుగ్లక్ నిర్ణయం! 20% ఓట్లు గల్లంతు
ట్రంప్ హయాంలో సైతం రెపరెపలాడుతున్న భారత యువత కీర్తి పతాకం
బాన పొట్టను తేలికగా తగ్గించుకోండి ఇలా?
చంద్రబాబు దర్శకత్వంలో ఏర్పడ్డ  'కర్ణాటక సంకీర్ణం'  చట్టు బండలు కానుందా?
ఏపి ప్రభుత్వానికి హైకోర్ట్ ఝలక్ - కొడి కత్తి కేసు విచారణకు "స్టే కి నో"
చంద్రనీతులు పట్టుకొని ఒక పత్రిక చక్కభజన - నిజమేంటి?
అభివృద్ధికి ఆయనే అడ్డంకి - హస్తినలో వాగ్ధానకర్ణుడుపై పేలుతున్నసెటైర్లు
నిర్ణయం పవన్ కళ్యాన్ దే! పొత్తుకు చంద్రబాబు రడీ!
రాజాసింగ్ ఒక్కడు చాలు! కేసీఆరును ఉప్పెనలా చుట్టేయటానికి?
మోడీకి పతనం మొదలైంది 'కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్' లో చంద్రబాబు
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
మహాకూటమి - మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదా?
“15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం!” అన్న వారిని పూచికపుల్లలా తీసేసిన రాజాసింగ్
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
About the author