తెలంగాణలో ముదస్తు ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల కమిషనర్, ఓం ప్రకాష్ రావత్ వివరించారు. జమిలి ఎన్నికలైతే పార్లమెంట్‌ ఎన్నికల్తో పాటే తెలంగాణ శాసనసభ కు జరిగేవని, ఏప్రిల్‌ 2019 లో అవి జరగాల్సి ఉందన్నారు. కానీ ఇప్పుడు ఆ వాదనకు అవకాశం లేదని పేర్కొన్నారు.



చట్టంలో ఈ విషయం పై ప్రత్యేకంగా ఎలాంటి నియమనిబంధనావళి ప్రవచించలేదని, దీనిపై 2002లో రాష్ట్రపతి అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం కోరగా, శాసన సభ రద్దయినప్పుడు ఎన్నికలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జరపాలని సూచించిందన్నారు. ఎందుకంటే "ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఆయాచిత ప్రయోజనం" లభించేలా ఆరు నెలల పాటు అధికారం లో ఉంచ కూడదని సుప్రీం కోర్ట్ సూచించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. 



"నవంబరులో ఎన్నికలు, డిసెంబరులో ఫలితాలంటూ కేసీఆర్‌ మాట్లాడటం గర్హనీయం. వ్యక్తులు, రాజకీయ నాయకులు, భవిష్యవాణిల ప్రకారం ఎన్నికల సంఘం నడుచుకోదు. ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషన్‌ సమర్ధించదు.  ఎన్నికల విషయమై కేసీఆర్‌ నన్నెప్పుడూ కలవలేదు. నాతో మాట్లాడనూ లేదు" 
chief election commissioner of india కోసం చిత్ర ఫలితం
ఇక ఇంకో విషయం, ఎన్నికల సంఘం కాకుండా వేరెవరో ఎన్నికల తేదీలను ప్రకటించడం దురదృష్టకరమని 'కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్' ఓపీ రావత్  చెప్పారు. శుక్రవారం నాడు ఒక తెలుగు వార్తా ఛానెల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై వారం రోజుల్లో నిర్ణయం తీసు కొంటామని ఆయన ప్రకటించారు. నాలుగు  రాష్ట్రాలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని ఎవరో చెప్పిన జోస్యం తో ఎన్నికల సంఘానికి ఎలాంటి సంబంధంలేదని అన్నారు.
chief election commissioner of india కోసం చిత్ర ఫలితం
ఎన్నికల తేదీలను నేతలే ప్రకటించడం దురదృష్టకరమన్నారు. "రాష్ట్ర ఎన్నికల కమీషనర్" నుండి నివేదిక వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణ గురించి నిర్ణయం తీసు కొంటామని ఆయన ప్రకటించారు.
సంబంధిత చిత్రం
అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్ఎస్ భవన్ మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై 'కేంద్ర ఎన్నికల కమిషనర్' ఓపీ రావత్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరినాటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు తాను, రాజీవ్ శర్మ ఐఏఎస్, ఎన్నికల సంఘం అధికారులతో కూడ చర్చించిన విషయా న్ని కూడ ఆయన మీడియా సమావేశంలో ప్రస్తావించారు. 
kcr and rajiv sharma కోసం చిత్ర ఫలితం
ఈ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషనర్ రావత్ స్పందించారు. ఈ వ్యాఖ్యలను దురదృష్టకరమైనవిగా ఆయన ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.  నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.  అయితే రాష్ట్రం నుండి వచ్చే నివేదికల ఆధారం గా అన్ని రకాల సౌకర్యాలు ఉంటే నాలుగు రాష్ట్రాల ఎన్నికల కంటే ముందే ఎన్నికలను నిర్వహించనున్నట్టు చెప్పారు. అయితే అపద్ధర్మ ప్రభుత్వం ఆరు మాసాలపాటు కూడ కొనసాగాల్సిన అవసరం కూడ లేదన్నారు ఓపి రావత్. 

chief election commissioner of india కోసం చిత్ర ఫలితం

"ఒక దేశం-ఒక ఎన్నిక" అంశం పరిధిలోకి తెలంగాణ ఎన్నికలు రావన్నారు. "జమిలి ఎన్నికలు"కు తాము మద్దతు ఇస్తున్నట్లు తెరాస ఇటీవల ప్రకటించిందని, కానీ ఇప్పుడు అంతకుముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తోందని" ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


"తెలంగాణా ఎన్నికల్లో ధన ప్రభావం అధికంగా ఉంటుంది. ఉచితవరాలు, డబ్బుల పంపిణీ, నగదు దుర్వినియోగంపై విస్తృత సాయిలో నిఘా ఉంచాల్సి వస్తుంది" రావత్ చెప్పారు 



మరింత సమాచారం తెలుసుకోండి: