ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి పార్టీ కి చెందిన నేతలు….అధికార పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తన పార్టీలో  చేర్చుకోవడంపై...ముఖ్యంగా ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడిన నేపథ్యంలో వైసీపీ నేతలు అసెంబ్లీకి రాకుండా జరుగుతున్న సమావేశాలను బహిష్కరించడం జరిగింది.

Related image

అయితే ఎన్నికల వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వైసిపి పార్టీని ఇరుకున పెట్టే విధంగా కామెంట్లు చేయడంతో..ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి ప్రజా సమస్యలు చర్చించాలంటే అసెంబ్లీ వేదిక అని పతివ్రత మాటలు చెబుతూ ప్రజలలో వైసిపి పార్టీని పలచన చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన కామెంట్లపై..వైసిపి స్పందిస్తూ అయితే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకుంటే అసెంబ్లీలో అడుగుపెడతామని వైపీపీ నేతలు పేర్కొన్నారు.

Image result for adinarayana reddy jagan

తమ పార్టీ గుర్తుతో గెలిచి.. ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్లారంటూ జగన్ కూడా ఫిరాయింపు నేతలపై మండిపడ్డారు. దమ్ముంటే రాజీనామా చేయాలని సవాలు విసిరారు. దీనిపై మంత్రి ఆదినారాయణ స్పందించారు. విశాఖలో విజయమ్మ తన వల్లే ఓడిపోయిందని ఒప్పుకుంటే... జగన్‌ వల్ల మేం గెలిచామని ఒప్పుకుంటామని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.

Related image

‘మా వంశ చరిత్ర గురించి నీవు మాట్లాడితే నీ చరిత్ర వందసార్లు చెబుతా.. మేం ఊరకుక్కలమైతే.. నువ్వు ఊరపందివి’ అంటూ జగన్‌ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ సీఎం కావడానికి తాము కూడా కృషి చేశామని, ఆ విషయం మర్చిపోవద్దని ఆదినారాయణరెడ్డి సూచించారు. ఇంకా దారుణంగా జగన్ ని విమర్శించారు. దీంతో జగన్ పై మంత్రి ఆది నారాయణ రెడ్డి చేసిన కామెంట్లుకి వైసిపి పార్టీకి చెందిన నేతలు మండిపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: