మాజీ ఎంపి ఉండవల్లి అరుణకుమార్‌ ఏ అంశాన్నయినా సునిశితంగా, లోతుగా అధ్యయనం చేస్తారు. ఏది మాట్లాడినా ఎంతో కొంత నమ్మదగిన ఆధారాలతో మాట్లాడుతారు. ఉండవల్లి అరుణకుమార్ వేసే ప్రశ్నలు శరాల్లా గుచ్చుకుంటూనే ఉంటాయి. తాజాగా ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆయన శరసంధానం చేశారు.  
amaravati bonds Vs Undavalli aruna kumar కోసం చిత్ర ఫలితం
రాష్ట్ర విభజన చట్టపరంగా చెల్లదని వాదిస్తున్న అరుణకుమార్‌ తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు  లోక్‌సభలో ఏవిధంగా ఎలా మాట్లాడాలో ఆమధ్య ముఖ్యమంత్రికి లేఖరాశారు. ఇదే మంచి తరుణమని  భావించిన తెలుగుదేశం పార్టీ అధినేతలు ఉండవల్లి అరుణ కుమార్ని ని పిలిచి మరీ ఏకాంత చర్చలు జరిపారు.  
amaravati bonds Vs Undavalli aruna kumar కోసం చిత్ర ఫలితం
ఉండవల్లి సలహా మేరకు పార్లమెంటులో టిడిపి ఎంపిలు మాట్లాడారా? లేదా? అనేది అప్రస్తుతం ఇక్కడ. ఉండవల్లి తమ పోరాటాన్ని గుర్తించారనే ఒక విధమైన సానుకూల సంకేతాలను ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ అదీ అనేక విస్గయాలపై ఉండవల్లి సాధికారత.  
undavalli on amaravati bonds కోసం చిత్ర ఫలితం
ఉండవల్లి ఏంటి? చంద్రబాబును కలిసి సలహాలు ఇవ్వడం ఏంటి? అని అందరూ అనుకుంటున్న తరుణంలో కాస్త ఆలస్యంగానైనా తనదైన శైలిలో అమరావతి అభివృద్ధి బండ్స్ విషయమై స్పందించారు. ప్రభుత్వం పై పదునైన వాగ్బాణాలను ఎక్కుబెట్టారు. దేశం లో మరెక్కడా లేని విధంగా 10.35 శాతం వడ్డీ ఇచ్చేలా జారీ చేసిన రాజధాని బాండ్లను ఎవరు కొనుగోలు చేశారో? చెప్పాలని ఉండవల్లి నిలదీశారు. బండ్స్ కొనేవారిని ముఖ్యంగా ముందే సిద్ధం చేసుకున్నారనే భావన ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అమరావతిలో దీనిపై చరచ బహిరంగంగానే జరుగుతుంది.
amaravati bonds Vs Undavalli aruna kumar కోసం చిత్ర ఫలితం 
అందుకే అమరావతి బాండ్లు కొనేవారిని దృష్టిలో ఉంచుకునే ఎక్కువ వడ్డీ ప్రకటించారన్న ఆరోపణలున్నఈ బాండ్లు కొనుగోలు చేసిన సంస్థల పేర్లను రహస్యంగా ఉంచింది ప్రభుత్వం. ఈ ఉదంతం అంతా అనుమానాస్పధంగానే ఉంది. ఇందులో ఏదో నిఘూఢ మర్మం దాగి ఉంది. 
undavalli on amaravati bonds  కోసం చిత్ర ఫలితం
ఉండవల్లి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం యివ్వగల దమ్ము తెలుగుదేశం ప్రభుత్వానికి గాని, నాయకునికి గాని ఉందా? 

*అమరావతి బాండ్లలో పెట్టుబడులు పెట్టినవ్యక్తుల సంస్థల వివరాలు ఎందుకు వెల్లడినంచట్లేదు. తప్పులేనప్పుడు, తప్పుకానప్పుడు వారి పేర్లు రహస్యంగా ఉంచాల్సి న అవసరం ఏమొచ్చిందనేది ఉండవల్లి మొదటి ప్రశ్న. 

*10.35 శాతం వడ్డీ ఇచ్చేటప్పుడు ఏకె కేపిటల్‌ అనే పేరుతో వచ్చిన వ్యక్తికి ₹ 17 కోట్ల కమీషన్‌ (బ్రోకరేజ్‌) ఇవ్వడాన్నీ కూడా ఉండవల్లి తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో  ఏదో 'ఫిష్షీ' ఉందనే భావనకు తావిచ్చారు. సమాధానం ఇవ్వకపోతే ఏదో ఫిష్షీ ఉందనే విషయం స్థిరం చేసుకోవచ్చు కదా! 


*ఈ సందర్భంగా గతంలో చంద్రబాబుకు విజన్‌ 2020 డాక్యుమెంట్‌ ఇచ్చిన “మెకన్సీ“ ప్రస్తుతం జైల్లో మ్రగ్గుతున్నారన్న విషయాన్ని మరచిపోరాదని వెల్లడించారు.అంటే, ఈ బాండ్ల వ్యవహారంలోనూ అక్రమాలు జరిగాయని ఆయన గట్టిగానే నమ్ముతున్నారనిపిస్తుంది. 

 undavalli on amaravati bonds కోసం చిత్ర ఫలితం
*ఇక మద్యం అమ్మకాలతో ప్రభుత్వం జన శ్రమను దోచుకుంటోందని చెప్పారు. ఛీఫ్‌ లిక్కర్‌ తయారీ, రవాణాకు అంతాకలిపి ₹8.50 ఖర్చవుతుండగా, ₹ 50కు విక్రయిస్తున్నా రని చెప్పారు. ఇందులో వైన్స్‌ షాపుల వారికి ఇచ్చేది ₹ 3.75 మాత్రమే నని, మిగతా దంతా ప్రభుత్వానికే వెళుతోందని చెప్పారు. మద్యంతో ఇంత భారీగా దోపిడీ చేయడం ఏమిటదనేది ఆయన లేవనెత్తిన కీలకమైన ప్రశ్న. 
amaravati bonds Vs Undavalli aruna kumar కోసం చిత్ర ఫలితం 
*ఇక రాష్ట్ర ప్రభుత్వ అప్పులపైనా ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ₹ 2,25,234 కోట్లు అప్పుల్లో ఉందని, ఈ నాలుగేళ్ల లోనే ₹ 1,30,000 కోట్లు అప్పు తెచ్చారని, ఈ డబ్బంతా ఏమయిందని ప్రశ్నించారు. 
undavalli on amaravati bonds కోసం చిత్ర ఫలితం
*ఇక పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగిపోతుండటంపై చంద్రబాబు స్పందిస్తూ పెట్రోలు ధర ₹100 చేస్తారేమో అని ప్రజల మీద ప్రేమ వున్నట్లు నంగనాచి కబుర్లు చెపుతూ బిజెపిని ఇరుకున పెట్టేలా మాట్లాడారు. దీనికి కూడా ఉండవల్లి అరుణకుమార్ కౌంటర్‌ ఇచ్చారు. పెట్రోలు వాస్తవ ధర ₹ 32 మాత్రమేనని, అయితే ₹ 85కు విక్రయిస్తున్నా రని అన్నారు. ఇందులో ₹ 19 మాత్రం కేంద్రానికి వెళుతుందని, మిగతాది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చేరుతోందన్నారు.
amaravati bonds Vs Undavalli aruna kumar కోసం చిత్ర ఫలితం
*కేరళలోలాగా పెట్రోలు ధరలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వెళుతుంది. కేంద్రానికి ఎంత వెళుతుందో తెలియజేసేలా బిల్లులు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.
undavalli on amaravati bonds  కోసం చిత్ర ఫలితం 
ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి కంటే - ఉండవల్లి సమగ్ర అధ్యయనంతో, వివరాలతో మాట్లాడారు. ఇవే అంశాలపై ఇప్పటి దాకా వైసిపి ఇంత స్పష్టంగా మాట్లాడిన ఉదంతాలు లేవు. ఉండవల్లి మూడు నెలలకో, ఆరు నెలలకో ఒక ప్రెస్‌మీట్‌ పెట్టినా అది కొన్నినెలల పాటు చర్చనీయాంశంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు లేవ నెత్తిన అంశాల పైనా అటు వంటి చర్చ జరుగుతోంది.

undavalli on amaravati bonds కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: