తెలంగాణాలో  ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ రద్దుతో కేసీయార్ పావులు కదిపారు. షాక్ నుంచి ఇపుడిపుడే బయటపడుతున్న ఇతర రాజకీయ పార్టీలన్నీ తామెక్కడ ఉన్నామో చూసుకుంటున్నాయి. బలాలూ, బలహీనతలపై పెద్ద కసరత్తే జరుగుతోంది. పొత్తులు, ఎత్తులతో తెలంగాణా హీటెక్కిపోతోంది.


అంతటా ఉత్కంఠ  :


తెలంగాణా ఏర్పాటు అయిన తరువాత జరుగుతున్న రెండవ ఎన్నిక ఇది. తొలి ఎన్నిక ఉమ్మడి ఏపీలో జరిగినా కొత్త రాష్ట్రం అన్న ప్రభావం నాడు ఛాలా ఉంది. పైగా టీయారెస్ ఉద్యమ పార్టీగా నాడు దూకుడుతో ఉంది. ఇపుడు నాలుగేళ్ళ టీయారెస్ పాలన చూసిన తరువాత జరుగుతున్న ఎన్నికలివి దాంతో ఎక్కడ ఓట్లు ఎటు పడతాయి, ఎలా పోలరైజేషన్ జరుగుతుంది అన్న చర్చ స్టార్ట్ అయింది.


ఆ ఓట్లు ఎటువైపు :


తెలంగాణాలో మళ్ళీ కులం, మతం, వర్గం, వర్ణం, ప్రాంతం అన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ ఓట్ల సంగతి ఎలా ఉన్నా అంధ్ర నుంచి అక్కడ సెటిల్ అయిన వాళ్ళ ఓట్లు ఎటు పడతాయి,  వారు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇంటరెస్టింగ్ మాటర్. పోయిన ఎన్నికలలో గుత్తమొత్తంగా అని చెప్పలేం కానీ ఆ ఓట్లలో మెజారిటీ టీడీపీకి పడ్డాయి. అప్పట్లో టీడీపీ అక్కడ బలంగా ఉంది. రిజల్ట్ వచ్చాక నెమ్మదిగా ఆ పార్టీ వీక్ అయిపోతూ వస్తోంది.


వర్కౌట్ అవుతుందా :


ఇపుడు చూసుకుంటే కాంగ్రెస్ తొ పొత్తు పెట్టుకుని సెటిలర్ల కాప్ రానేనని చెప్పుకోవాలని టీడీపీ చూస్తోంది. కాంగ్రెస్ కూడా టీడీపీ వల్ల అంధ్ర ఓట్లు బాగనే పడతాయని ఆశ పడుతోంది. అందుకే సెటిలర్లు ఎక్కువ ఉన్న చోట్ల టీడీపీ సీట్లు అడుగుతోంది.  మరో వైపు కాంగ్రెస్ టీయారెస్ ని టార్గెట్ చేస్తోంది. ఆంధ్రా ఓటర్లను తొలగించేందుకే కేసీఆర్‌ సమగ్ర కుటుంబ సర్వే చేయించారన్నారని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి అంటునారు.   ఆ విధంగా చెప్పడం ద్వారా ఆ ఓట్లను తమ వైపుకు తిప్పుకోవాలన్న ఆలొచనలో కాంగ్రెస్ ఉంది.మరి ఓట్లు పడతాయా


అప్పట్లో అలా :


జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు అన్నీ గుత్తమొత్తనా టీయారెస్ కే  పడ్డాయి. అప్పట్లో లోకెష్ బాబు కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసినా కూడా జనం కనికరించలేదు. ఆ తరువాత పరిస్థితి చూసి మిగిలిన వాళ్ళు కూడా టీడీపీ నుంచి జెండా ఎత్తేశారు. మరి అపుడు లేని బలం ఇపుడు టీడీపీకి వస్తుందా. సెటిలర్లు మళ్ళీ సైకిలెక్కుతారా అన్నది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: