టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ముందస్తు ఎన్నికలు ప్రకటించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో  ఎన్నికల ప్రకటన అయిందో లేదో ఆలస్యం వెంటనే హుస్నాబాద్ నుంచి ఎన్నిక‌ల ప్రచారాన్ని మొదలెట్టేశారు. ఈ పరిణామంతో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎన్నికలకు ముందే కళ్లు తెరవకపోతే ఇండస్ట్రీ ఎన్నికలలో చాలా నష్టం వాటిల్లుతుందని భావించి రాష్ట్రంలో పొత్తులకు రెడీ అయిపోయారు.
Image result for chandrababu
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యి రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి వ్యతిరేకంగా పోరాడే రాజకీయ పార్టీలను ఏకం చేసి ఒక కూటమిగా ఏర్పడి టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి ఈసారి ఎన్నికలలో అవకాశం రాకుండా చేయాలని ప్రణాళికలు రెడీ చేసేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలు తెలుగుదేశం పార్టీ, సీపీఐ, టీజేఎస్, ఇంటి పార్టీ, యువ‌జ‌న తెలంగాణ వంటి పార్టీలతో జత కట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు.
Image result for chandrababu uttam
ఈ మేరకు పొత్తుల కోసం తామే చొర‌వ‌తీసుకోవాల‌ని నిర్ణయించి సంప్రదింపుల కోసం కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, ష‌బ్బీర్ అలీ, భ‌ట్టీ విక్రమార్కలతో క‌మిటీని నియ‌మించారు.
Image result for chandrababu utham
కమిటీ లో ఒకరు అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలుగుదేశం పార్టీతో కచ్చితంగా పొత్తు ఉంటుందని స్పష్టం గా తెలియజేశారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఇచ్చే  సీట్ల విషయంలో కూడా క్లారిటీ గా ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాబోతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు తో సమావేశం అవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: