తెలంగాణ లో ఎన్నికల హోరు మొదలైంది అయితే చంద్ర బాబు కూడా ప్రచారం చేస్తూ ఆర్బాటం చేయాలి కదా అని మీకు డౌట్ రావొచ్చు అయితే ఓటుకు నోటు కేసులో దొరక్కుండా ఉండి ఉంటే ప్రచారం చేసేవాడే..!  2014లో ఉన్న దూకుడు ఇప్పుడు చూపించే పరిస్థితి లేదు. ఒకవేళ కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్నా అదంతా నామమాత్రంగానే ఉండే అవకాశం కనబడుతోంది. అధినేత చంద్రబాబు ప్రత్యక్షంగా రంగంలోకి దిగకుండా తెరవెనక ఉండటంవల్ల ప్రయోజనం ఉంటుందా? ఎన్నికల బాధ్యత అంతా మీదేనంటూ అంతా రాష్ట్ర నాయకుల మీదనే పెట్టేశారు.

Image result for chandra babu and kcr

నాయకుడు నేరుగా రంగంలో లేకుండా నేతలు ఉత్సాహంగా పనిచేయగలరా? కేసీఆర్‌ ఉన్నట్లుండి అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లడమే అన్ని పార్టీలను ఇబ్బందిలోకి నెట్టింది. చంద్రబాబు ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే కేసీఆర్‌ను ఢీకొనాల్సివుంటుంది. అదే జరిగితే కేసీఆర్‌ చాలాదూరం వెళతారు. బలంగా విమర్శలు, ఆరోపణలు చేస్తారు. ఇదంతా ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా ప్రధాని మోదీ, కేసీఆర్‌ ఒక్కటయ్యారు కాబట్టి ఇద్దరూ కలిసి బాబుకు ఇబ్బందులు కలిగించే అవకాశముంది.

Image result for chandra babu and kcr

ఏపీలో ఎన్నికలు జరగడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మోదీ ఈలోగా ఏమైనా చేయొచ్చు. ఏపీలో ఎన్నికలు జరిగేనాటికి తెలంగాణలో కేసీఆర్‌ పాలన మొదలై కొంతకాలం గడవడమే కాకుండా రిలాక్స్‌డ్‌గా ఉండి జాతీయ రాజకీయాల్లో తనవంతు పాత్ర నిర్వహించడానికి కసరత్తు చేస్తుంటారు. ఈ ఎన్నికల్లో బాబు నేరుగా రంగంలోకి దిగినా టీడీపీ అధికారంలోకి రాదు. ఇక్కడ సమయం కేటాయిస్తే ఏపీలో ఏం గందరగోళం జరుగుతుందో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: