తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికీ 80 కాలం నాటి పాలిటిక్స్ చేస్తున్నారు. అప్పట్లో అయితే చెల్లింది కానీ ఇపుడు టెక్నాలజీ బాగా పెరిగిన టైంలో కుదిరే వ్యవహారం కాదు. కానీ బాబు మార్క్ ఓల్డ్ ట్రెండ్ అలాగే సాగుతోంది. మరి అది పార్టీకి మరింత చేటు తెస్తుందా అంటే అవుననే ఆన్సర్ వస్తోంది. ఆయన ఆలోచనలు పొత్తుల ఎత్తులు  మొదటికే ముప్పు తెస్తున్నాయని తమ్ముళ్ళు వాపోతున్నారు. 


పొత్తులపై రాంగ్ స్టెప్ :


ఏ రాజకీయ పార్టీకైనా కొన్ని మౌలిక సూత్రాలు ఉంటాయి. అవి ఎప్పటికీ మారవు. ఎంత రాజకీయం అని చెప్పుకున్నా వాటిని ఎవరూ తోసేసి ముందుకు పోరు. ఎందుకంటే అవే పార్టీకి ఆత్మ, అస్తిత్వం కాబట్టి మరి అలాంటిది కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏర్పాటు అయిన టీడీపీని ఆ పార్టీతో పొత్తు పేరుతో కలిపేయడాన్ని బాబు పక్కా రాజకీయం అనుకోవచ్చు. హార్డ్ కోర్ టీడీపీ క్యాడర్ తో పాటు జనాలు మాత్రం రాంగ్ స్టెప్ అంటున్నారు.


లొకల్ డిసిషన్ ట :


ఎవరెన్ని చెప్పుకున్నా టీడీపీలో కర్త కర్మ క్రియ చంద్రబాబే అన్నది సత్యం. అటువంటిది తెలంగాణా ఎన్నికలలో పొత్తుల వ్యవహారాన్ని అక్కడ పార్టీ ఇష్టానికి వదిలేసినట్లుగా లీకులు వస్తున్నాయి. మరి జాతీయ పార్టీ అని ఘనంగా  చెప్పుకునే టీడీపీ అధినేత నిన్నటి వరకూ ఏలిన చోట చెతులెత్తేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి. 


ఆ లెక్కలు కుదరవు :


రెండూ రెండూ నాలుగు అన్నది లెక్కల్లో కరెక్ట్. రాజకీయాలలో మాత్రం కానే కాదు. కానీ బాబు మాత్రం ఓల్డ్ టైప్ పాలిటిక్స్ నే నమ్ముకుంటున్నారు. ఈ రోజులలో సోషల్ మీడియ ఒకటి ఉందని మరచిపోతున్నారు. తెలంగాణాలో టీయారెస్ వర్సెస్ అదర్స్ గా రేపటి పోరు సాగనుంది. ఆ టైంలో పొలరైజేషన్ కంప్లీట్ గా కేసీయార్ కే అనుకూలంగా మారే చాన్స్ ఉంది. సామాన్య  ఓటర్లకు సీఎం క్యాండిడేట్ ఎవరో బాబు, కాంగ్రెస్ కూటమి చెప్పగలదా. ఈ అయోమయమే మరో మారు కేసీయర్ ని గద్దె ఎక్కిస్తుంది. పొత్తు పేరుతో అసలుకే ఎసరు తెచ్చిపెట్టుకుంటోంది టీడీపీ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: