తెలంగాణ లో ఎన్నికల హోరు మొదలైంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సై అనే సరికే అన్నీ పార్టీలు ఇప్పుడు సిద్ధమవుతున్నాయి.  ఎన్నికల్లో కేసీఆర్‌ ఘనవిజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అసదుద్దీన్‌ ఓవైసీ చెప్పగా, కర్నాటకలో తక్కువ సీట్లు సాధించిన జేడీఎస్‌ నాయకుడు కుమారస్వామి సీఎం అయినట్లుగా తెలంగాణకు తాను ఎందుకు సీఎం కాకూడదని తాజా మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు.

ఎంఐఎంకు ముఖ్యమంత్రి పదవా?

ఈమాట ఉబుసుకోకకు అన్నాడో, సీరియస్సో తెలియదు. డిసెంబరులో ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ముఖ్యమంత్రి పదవి కోసం కేసీఆర్‌ను అడుగుతామన్నారు. కర్నాటకలో కుమారస్వామి కింగ్‌ మేకర్‌గా మారినప్పుడు ఎంఐఎంకు కూడా ఆ అవకాశం వచ్చే అవకాశం ఉందన్నారు. డిసెంబరులో ఎవరి అవసరాలు ఎలా ఉంటాయో చూద్దామన్నారు. టీఆర్‌ఎస్‌కు తగినంత మెజారిటీ రాదని అక్బరుద్దీన్‌ భావిస్తున్నారా? కర్నాటకలో జరిగిన ఎపిసోడ్‌ తెలంగాణలో జరుగుతుందని గ్యారంటీ ఏమిటి?

Image result for chandrababu

కాంగ్రెసు బలం పెరుగుతోందని,  ఆ పార్టీ మరింత బలపడితే టీఆర్‌ఎస్‌కు దెబ్బ తగులుతుందని, ఈ నేపథ్యంలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందని, కాబట్టి తన పార్టీ కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుందని బాబు ఊహించారు. కాని అందరి అంచనాలను కేసీఆర్‌ తప్పించారు. అందరి ఊహాగానాలను తారుమారు చేస్తూ ముందస్తు ఎన్నికలకు తెర తీశారు. తెలంగాణలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడకపోవచ్చని మీడియా అంచనా వేస్తోంది. టీఆర్‌ఎస్‌కు 80కి పైగా సీట్లు రావచ్చని అనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే టీఆర్‌ఎస్‌తో తలపడేది కాంగ్రెసు మాత్రమేననిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: