ఈ మధ్యనే ఓ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది. ఆ మూవీ పేరు కేరాఫ్ కంచరపాలెం. ఇపుడు మరో మారు కంచరపాలెం మారు మోగుతోంది. బంపర్ హిట్ కొట్టిన ఈ కంచరపాలెం రాజకీయ తెరపై జనం చూపించారు. జగన్ హీరోగా ఈ  కంచరపాలెం రికార్డ్ స్థాయిలో మోత మోగుతోంది, జనసంద్రమైంది. ఇటీవల ఇంతటి అతి పెద్ద సభ జరగలేదు, చూడలేదు అంటున్నారు జనం. అలా జనమే జనంగా జగన్ సభ సాగింది. 


సిటీ టర్న్ అయిందా :


విశాఖ పట్టు దొరకక గత ఎన్నికలలో వైసీపీ  చతికిలపడింది. మొత్తనికి మొత్తం సీట్లనీ టీడీపీ గెలుచుకుంది. నాడు వైఎస్ విజయమ్మ కూడా పోటీ చేసి ఓడిపోయారు. అంతటి ఘోర అవమానం తరువాత మళ్ళీ విశాఖ వైసీపీ వైపు చూస్తోందా అన్న ఆలోచలను రేపేలా జగన్ కంచరపాలెం మీటింగ్ జరిగింది.


రివర్స్ గేర్ :


విశాఖ డెవలప్మెంట్ రివర్స్ గేర్ అంటూ జగన్ అంటే జనం బాగా కనెక్ట్ అయ్యారు. వైఎస్ హయాంలో ఉక్కు పరిశ్రమకు రక్షణ, ఐటీ, బ్రాండిక్స్, ఐర్పోర్ట్ డెవలెమ్మెంట్ ఎవన్నీ దివంగన నేత టైంలో జరిగాయని జగన్ చెబుతున్నపుడు జేజేలు పలికారు. అయిదేళ్ళ వైఎస్సార్ పాలన కళ్ళ ముందు జగన్ ఆవిష్కరించడమే కాదు. బాబు పాలనలో హామీలను ఎండగట్టారు. విశాఖకు బాగు ఏం చేశారని జగన్ నిలదీత పాతిక లక్షల మంది జనం  గుండెల్లో మాటగా వినిపించింది,అనిపించింది. 



మరి సిటీలో ఏడుకు ఏడూ అసెంబ్లీ సీట్లు ఈసారి వైసీపీ ఖాతాలో పడతాయా. విశాఖ ఎంపీ సీటు సాధించి వైసీపీ గత అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటుందా. అంటే అవుననే కంచరపాలెం మీటింగ్ చెబుతోంది. అంతే మరి. పవర్ ఆఫ్ కంచరపాలెం, మ్యాజిక్ ఆఫ్ కంచరపాలెం అది. కేరాఫ్ కంచరపాలెం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: