తెలంగాణాలో రానున్న ముందస్తు ఎన్నికలకు అన్నీ పార్టీలు సమాయత్తమౌతున్నాయి. కూటమి, పొత్తులవార్తలలో తెలంగాణా హోరెత్తుతోంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా "తెలంగాణా - తెలుగుదేశం పార్టీ"  సారధ్యంలో  "మహాకూటమి"  ని ఏర్పాటు చేయాలని టిడిపి నిర్ణయం తీసుకొంది.  
Image result for telangana mahakuTami
ఇప్పుడు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు ఆదివారం నాడు  "సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి" చాడ వెంకటరెడ్డికి "టి-టిడిపి అధ్యక్షుడు" ఎల్. రమణ ఫోన్ చేయగా దానికి చాడా సాయంత్రం నాలుగు గంటల తర్వాత  సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో రెండు రోజుల పాటు టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కీలక నేతలు సమావేశమయ్యారు. సెప్టెంబర్ 8వ తేదీన తెలంగాణ "టీడీపీ జనరల్ బాడీ సమావేశం" జరిగింది. సెప్టెంబర్ 9వ తేదీన  తెలంగాణ పొలిట్ బ్యూరో సభ్యులతో  చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.
Image result for telangana mahakuTami
తెలంగాణా ఎన్నికల్లో పొత్తుల విషయమై "తెలంగాణా టిడిపి శాఖ" కే ఆ నిర్ణయాన్ని వదిలేశారు. అయితే పొత్తుల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్ధేశం చేశారు. అయితే  టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా  కలిసొచ్చే పార్టీలతో మహా కూటమిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే జాతీయ స్థాయిలో కూడా బిజెపి వ్యతిరేఖ వ్యూహాలను రచించటంలో ఆయన ఇప్పటికే మునిగిపోయారు.
Image result for telangana mahakuTami
అయితే ఈ మేరకు తెలంగాణ టీడీపీ నేతలు చర్యలను ప్రారంభించారు. కలిసొచ్చే పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు వీలుగా మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ శాఖకు చెందిన టిడిపి నేతలు రంగం సిద్దం చేశారు. చంద్రబాబు అమరావతికి బయలుదేరి వెళ్లగానే సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్  చేశారు. ఆదివారం సాయంత్రం కలిసి మాట్లాడదామని చాడ వెంకటరెడ్డి, ఎల్.రమణకు సూచించినట్లు సమాచారం. 
Image result for telangana mahakuTami
మరో వైపు సోమవారం నాడు  కోదండరాం సారధ్యంలోని తెలంగాణా జన సమితి - టీజేఎస్ తో  టి-టీడీపీ నేతలు చర్చించనున్నారు. మహాకూటమిలోకి బాజపా టిఆరెస్ వ్యతిరేఖ పార్టీలను ఆహ్వానించేందుకు వీలుగా చర్చించడానికి ఒక కమిటీని కూడ ఏర్పాటుచేయనున్నారు. దీనికి తోడుగా ఎన్నికల మేనిఫెస్టో, ప్రచార కమిటీలను కూడ ఏర్పాటు చేయనున్నారు.


రాజకీయంగా తెలంగాణలో తమను ఇబ్బందిపెట్టిన టీఆర్ఎస్, బీజేపీలకు బుద్దిచెప్పే దిశగా  వ్యూహరచన చేస్తోంది టీడీపీ.  అయితే  ఈ మహాకూటమిలో ఏ ఏ పార్టీలు ఉంటాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Image result for chada venkatareddy & L ramana
*ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ చేరుతుందా?

*సీపీఎం ను కూడ కలుపుకొని వెళ్తారా?

*సీపీఎం ఇప్పటికే బహుజన లెఫ్ట్ Fరంట్ - బీఎల్ఎఫ్ పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేసింది.

*ఈ కూటమి ని కాకుండా టీడీపీ ఏర్పాటు చేసే కూటమిలో సీపీఎం చేరుతోందా? లేదా? అనేది  ఇప్పటికిప్పుడే చెప్పలేం. 

*టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కూడగట్టే దిశగా టీడీపీ నేతలు ప్రణాళిక రచిస్తున్నారు. 

*మరో వైపు  కాంగ్రెస్ పార్టీ టీడీపీ తో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమతో కలిసి పనిచేయాలని కోరింది.

*టీడీపీయే  మహాకూటమి ఏర్పాటుకు ముందుకు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిలో చేరుతోందా? లేదా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


* కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొంటే రాజకీయంగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడ నష్టమే అనే భావన తెలుగుదేశం వర్గాల్లో కలవరపాటును కలిగిస్తుంది. అందుకే "మహాకూటమి" ఏర్పాటు దిశగా టీడీపీ కార్యాచరణను ప్రారంభించిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.  

Image result for telangana bjp leaders

మరింత సమాచారం తెలుసుకోండి: