తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు రావడం తో అన్నీ పార్టీలు ఒక్కసారిగా అలెర్ట్ అయినాయి అయితే తెలంగాణ టీడీపీ పరిస్థితి ఎవరికీ అర్ధం కాకుండా తయారైంది.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతమతమైపోతున్నారు. ఆయన సొంత రాష్ట్రం ఆంధ్రాలో కాదు. ముందస్తు ఎన్నికలు జరగబోతున్న తెలంగాణలో. కాంగ్రెసుతో పొత్తు లేకుండా ఎన్నికల్లో కొన్ని సీట్లయినా సాధించడం కష్టం. అలాగని కేవలం ఆ ఒక్క పార్టీతోనే పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా ఆంధ్రాలో ఇబ్బంది కలుగుతుంది. తెలంగాణలో ప్రత్యక్షంగా ప్రచారం చేయడం ఆయనకు ఇష్టం లేదు. అలా చేస్తే టీఆర్‌ఎస్‌తోనే కాకుండా బీజేపీతో కూడా ఇబ్బందే.

Image result for chandra babu

కాబట్టి ఎంతసేపటికీ తెర వెనక ఉండే రాజకీయ నడిపించాలి. ఇది ఆయనకు చాలా ఇబ్బందిగా ఉంది. టీడీపీని ఒంటరిగా లీడ్‌ చేసే నాయకత్వం తెలంగాణలో లేదు. రేవంత్‌ రెడ్డివంటి నాయకుడు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కాని రమణ సమర్థుడైన నాయకుడు కాడనే అభిప్రాయం బాబుకు ఉంది. బాబు ప్రత్యక్షంగా రంగంలోకి దిగలేని పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెసు నేతలు టీడీపీని ఎంతవరకు కేర్‌ చేస్తారో.

Image result for chandra babu

కాని బాబుకు తప్పడంలేదు. కాంగ్రెసుతో పొత్తు అక్కర్లేదని, ఒంటరిగా పోటీ చేద్దామని కొందరు అంటున్నా పొత్తు లేకుండా పోటీ చేయడం సాధ్యం కాదని బాబు వారికి చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఇతర పార్టీలతోనూ చర్చలు జరిపి కూటమి ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెసుతో పొత్తు తప్పదంటున్న బాబు ప్రచారానికి రానని టీడీపీ నేతలకు స్పష్టం చేశారు. కాంగ్రెసు తరపున ప్రచారం చేస్తే దాన్ని ప్రభావం ఏపీ రాజకీయాలపై పడుతుందని భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: