చంద్ర బాబు నాయుడు నాకేం భయం లేదు ఈ దేశం లో అందరి కన్నా సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటారు. అయితే  తెలంగాణలో తాను అది చేసా, ఇది చేసా అంటారు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ఎలా వుందన్నది చెప్పరు. మోడీ, భాజపా వెనకాల వున్నాయి అంటారు కానీ, కేసీఆర్ వాళ్లకు లొంగిపోయారు అని అనరు. జగన్ మీద, మోడీ మీదా కూడా ఒంటికాలి మీద లేచి, తన భాషాజాలం అంతా వాడేసి విమర్శలు చేసే బాబుగారు, ఒక్క కేసీఆర్ విషయంలో మాత్రం వెనకడుగే వేస్తున్నారు.

Image result for chandra babu

వాస్తవానికి కుదరలేదు కానీ, పాపం, కేసీఆర్ తో పొత్తు పెట్టుకుందామనే చూసారు. కానీ ఎక్కడా సాధ్యంకాలేదు. ఈక్వేషన్లు అస్సలు కుదరలేదు. వన్ పర్సంట్ కుదిరినా బాబుగారు ఆ చాన్స్ వదిలేవారు కాదు. బాబుగారు పెట్టుకునే ఏ అక్రమ సంబంధాన్నైనా, సక్రమంగా చూపించాడానికి ఆయన మీడియా ఆయనకు వుంది. ఎదుటవారివి అన్నీ అక్రమసంబంధాలే అని కూడా అదే మీడియా బమ్మిని తిమ్మిని చేస్తుంటుంది.

Image result for chandra babu

సరే, ఆ విషయం వదిలేసి మళ్లీ అసలు విషయానికి వస్తే, నిన్నటికి నిన్న హరికృష్ణ కార్యక్రమం వుంది కాబట్టి, తప్ప హైదరాబాద్ వచ్చారు. పనిలో పనిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులకు కాస్త ధైర్యం చెప్పారు. మన కేడర్ మనకు వుంది. మీరు యోధులు పోరాడండి. పోరాడితే పోయేది మీరే తప్ప, నేను కాదు అని మాత్రం అనలేదు.  తాను మాత్రం ముఖ్యమంత్రిగా వున్నాను కనుక ఎన్నికల ప్రచారానికి రాను అనేసారు. నిజానికి బాబుగారు ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటే అక్కడి నుంచి వందల కోట్లు డంప్ చేయగలరు. కాపుల ఏరియాకు కాపు మంత్రిని, రెడ్ల ఏరియాకు రెడ్డి మంత్రిని, యాదవ సామాజిక వర్గం కోసం ఆ కులానికి చెందిన మంత్రిని, ఇలా జనాలను అందరినీ ఆ మధ్య ఆళ్లగడ్డకు ఎలా డంప్ చేసారో అలా చేసి వుండేవారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: