ఎన్నికల వేళ మళ్ళీ ఎక్కడలేని ఉద్యమాలు వచ్చిపడుతున్నాయి. హమీలు గుర్తు చేసి ఇరుకున పెట్టే వ్యూహాలు రెడీ అయిపోయాయి. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న వారంతా సర్దుకుంటున్నారు. ఏక గళం వినిపిస్తూ పాలకులకు వార్నింగులు ఇస్తున్నారు. ఓట్ల అవసరం పడిన రాజకీయ పార్టీలు తప్పక మాట వింటాయన్న నిబ్బరంతోనే ఇలా చేస్తున్నారు.


పది శాతం అంటున్న ముద్రగడ :


కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు చాలవని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాదం కుండ బద్దలు కొట్టారు. కాపులను వాడుకుని వదిలేసే వారిని ఎన్నికల జాతరలో పాతరేస్తామంటూ హూంకరించారు. పది శాతం రిజర్వేషన్లతో ఏపీ అసెంబ్లీ కొత్త బిల్లు చేయాల్సిందేనన్ని ఆయన డిమాండ్ చేశారు. అలాగే సీమ, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోని  బలిజలను కూడా రిజర్వేషన్ల కేటగిరిలోకి తీసుకురావాలని అన్నారు.


కాంగ్రెస్ బెటర్ :


విశాఖలో జరిగిన కాపు నాయకుల మీటింగులో ముద్రగడ పద్మనాభం ఇంటెరెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాడు కాంగ్రెస్ సర్కార్ కాపుల కోసం 30 జీవోను ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. బీసీలలో చేరుస్తూ డేరింగ్ స్టెప్ తీసుకున్న ఆ పార్టీని ఓడించి తప్పు చేశామని ముద్రగడ అనడం విశేషం. కాపులకు కాంగ్రెస్ చేసిన మేలు గొప్పదని కూడా అన్నారు. ఇతర పార్టీల హామీలకు కాపులు మోసపోతున్నారని ఆవెదన వ్యక్తం చేశారు


వీధుల్లోకే :


లేటేస్ట్ గా కాపుల రిజర్వేషన్లపై ముద్రగడ చంద్రబాబు సర్కార్ కి అల్టిమేటం జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా చెప్పిన సవరణలతో కొత్త బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి మళ్ళీ పంపాలని డిమాంద్ చేశారు. లేని పక్షంలో కాపులంతా రోడ్డెక్కుతారని, ఆ ఉద్యమాన్ని ఏ ప్రభుత్వమూ తట్టుకోలేని తీరులో ఉంటుందని కూడా హెచ్చరించారు. మొత్తానికి బాబుతో అమీ తుమీ కి తుది పోరటానికి ముద్రగడ రెడీ అయిపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: