భారత దేశంలో ఎన్డీఏ పాలన వచ్చిన తర్వాత ఇందన ధర అడ్డ గొలిగా పెరుగుతుందని..పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో అన్న టెన్షన్లో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.  డీజిల్ రేట్లు పెరిగితే...ప్రయాణ భారం కూడా అధికమవుతుందని..ఇది సామాన్యులు భరించలేని పరిస్థితికి చేరుకుంటుందని గగ్గోలు పెడుతున్నారు.  ఇక పెట్రోల్, డీజిల్ ధరలను రూ.100కు పెంచాలని కంకణం కట్టుకున్నట్టే వుంది కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే. ఇంధన ధరలకు వ్యతిరేకంగా భారత్ బంద్ నడుస్తోందన్న సంగతిని కూడా పట్టించుకోకుండా వీర బాదుడు బాదేశారు. 

Bharat Bandh against Petrol and diesel price hike live updates

పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 22 పైసల మేర పెంచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 25 పైసలు పెరిగి రూ.85.60 ఉండగా.. డీజిల్‌ ధర కూడా 24 పైసలు పెరిగి రూ.79.22 కి చేరింది.  గత కొంత కాలంగా పెట్రో, డీజిల్ రేట్లు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తుంది కేంద్ర ప్రభుత్వం.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీఎస్ సహా 21 ప్రధాన విపక్షాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు బంద్‌లో పాల్గొంటున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది. పలుచోట్ల నిరసనకారుల నిరసనలు హద్దుమీరాయి. వాహనాలను కాల్చుతున్నారు. 

Bharat Bandh LIVE Updates: Ravi Shankar Prasad Challenges Manmohan Singh Over Fuel Price Hike

పెట్రోల్ బంకులపై దాడులు చేస్తున్నారు. దుకాణాలను బలవంతంగా మూయించారు. పెరిగిన పెట్రోల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క మాట్లాడటం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. పెట్రో ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వాన్ని మార్చే సమయం దగ్గరలో ఉందని మన్మోహన్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు రాజకీయ విభేదాలను పక్కనబెట్టాలని, ఏకతాటిపై నిలబడి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 22 పైసలు పెరిగింది. 

Bharat Bandh disturbs normal life in Telugu states,protestors arrested

దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.73, డీజిల్‌ రూ.72.83గా ఉంది. ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.88.12కి చేరగా.. డీజిల్‌ ధర రూ.77.32గా ఉంది. ఇక హైదరాబాద్‌లో నేడు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.60, డీజిల్‌ ధర రూ. 79.22గా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌పై రూ.19.48, డీజిల్‌పై రూ.15.33 ఎక్సైజ్‌ సుంకాన్ని విధిస్తోంది. ఇక ఆయా రాష్ట్రాల్లో వీటిపై వ్యాట్‌ కొనసాగుతోంది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వ్యాట్‌ తక్కువగా(6 శాతం) ఉంది. ఇక భారత్ బంద్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కావాలంనే కేంద్రం మరోసారి ఇందన రేట్లు పంచడంతో ఇది అధికార దురహంకారానికి పరాకాష్ట అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలపై తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: