దేవుడికి, సమాజానికి మధ్య వారధులు బ్రాహ్మణులు అన్నారు వైఎస్ జగన్. చదువులు దేవుడిచ్చిన వరం. అయినా ఉద్యోగాలు రాని పరిస్తితి. అర్చక వ్రుత్తిని చేసినా కూడా పొట్ట గడవడం లేదు. ఆర్ధికంగా బాగా దయనీయంగా ఉన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు తగిన న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.  విశాఖలో ఈ రోజు బ్రాహ్మణ అత్మీయ సదస్సు జరిగింది


గుడిని, లింగాన్ని మింగేశారు :


టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గుడిని, గుండిలో లింగాన్ని కూడా మింగేస్తున్నారని జగన్ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు దేవుడంటే భయమూ లేదు, భక్తి అంత కంటే లేదని సెటైర్లు వేశారు. దేవుడి సొమ్ముని దోచుకోవడానికి ఎంతకైనా తెగించే ప్రభుత్వం ఇపుడు అధికారంలో ఉందని అన్నారు. కళ్ళార్పకుండా ఎన్నో అబద్దాలను చెప్పడం చంద్రబాబుకే సాధ్యమని, అన్ని వర్గాలతో పాటుగా హామీలు ఇచ్చి బ్రాహ్మణులను కూడా మోసం చేశారని జగన్ నిందించారు.


పుష్కరాల పేరిట దోపిడి :


క్రిష్ణా, గోదావరి పుష్కరల సందర్భంగా మూడు వేల 200 కోట్ల రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం స్వాహా చేసిందని జగన్ ఆరోపించారు. నామినేషన్ పద్ధతిలో తమ వారికే పనులను అప్పగించి వేల కోట్లు దిగమింగేశారని జగన్ ఫైర్ అయ్యారు. విజయవాడ అమ్మ వారికి చెందిన 11 ఎకరాల భూములు అక్షరాలా 1100 కోట్లు చేస్తాయని, వాటిని టీడీపీ మనుషులకు కేవలం ఎకరం లక్ష రూపాయలకు ఇచ్చి కారు చౌకగా గుడి భూములు దోచుకున్నారని విమర్శించారు.


సదావర్తి సంగతేంటి ::


ఇక సదావర్తి భూముల కధ కూడా ఇలాంటిదేనని,  వైసీపీ పోరాడి నిలబెట్టిందని జగన్ చెప్పుకొచ్చారు. కనక దుర్గమ్మ ఆల‌యంలో తాంత్రిక పూజలు చేయించిన ఘనత బాబుదేనని అన్నారు. తిరుపతి హుండీలో కూడ నగదు, నగలు మాయమవుతున్నాయని అక్కడ ప్రధానార్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు చెప్పారంటే ఎంతవరకూ వెళ్ళిపోయారో అర్ధమవుతోందని జగన్ అన్నారు.


హామీలు దెముడెరుగు.. అవమానాలే మిగులు :


బ్రాహ్మణుల కోసం తొమ్మిది హామీలు చంద్రబాబు ఇచ్చారని, ఒక్కటీ కూడా సవ్యంగా చేసినా పాపాన పోకపోగా, ఆ జాతిని అవమానించారని జగన్ అన్నారు. అందుకు ఐవైఆర్ క్రిష్ణారావు, రమణ దీక్షితులు ఒక ఉదాహరణ అన్నారు.  వైఎస్ హయాంలో 14 వేల గుడులకు దూపధీపాలకు నిధులు ఇస్తే వాటిని మూడు వేలకు తగ్గించిన పాపమూ బాబుదేనని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: