ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్న ఇప్పటిదాకా చంద్రబాబు రాజకీయాలు చేస్తూ వచ్చారంటే దానికి గల కారణం మీడియా. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మీడియా ఎక్కువ శాతం అధికార పార్టీ తెలుగు దేశం కనుసన్నల్లో నడుస్తుంది అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చంద్రబాబుకు మద్దతు తెలిపే మీడియా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పై లేనిపోని ప్రచారాలు చేస్తూ కథనాలు ప్రచురిస్తూ బురదజల్లే కార్యక్రమం ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. మరోపక్క చంద్రబాబు ఏదైనా తప్పు చేసినా కానీ సదరు మీడియా అంతగా ఆ విషయాన్ని కవర్ చేయకుండా కుటిలమైన రాజకీయాలు మీడియాలో చేస్తుంటారు.

విశాఖలో  కోనసాగుతున్న ప్రజా సంకల్పయాత్ర (ఫోటోలు)

ఇదే క్రమంలో జగన్ కూడా చంద్రబాబు కి మద్దతు తెలిపే యెల్లోమీడియా ని తమ మీడియా సమావేశాలకు రావొద్దు అంటూ చాలా సందర్భాలలో తెలియజేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎల్లో మీడియా ఛానల్ లో చంద్రబాబు కి తొత్తుగా పనిచేసే ఒక దమ్మున్న ఛానల్. జగన్ పై పాజిటివ్ వార్తలు ప్రసారం చేసింది. ఈ వార్తలు చూసిన రాష్ట్ర రాజకీయ నాయకులు షాక్ తిన్నారు. మీడియా రంగంలో ఇది ఒక అద్భుతం అన్నారు.

విశాఖలో  కోనసాగుతున్న ప్రజా సంకల్పయాత్ర (ఫోటోలు)

ఇంతకీ ఆ దమ్మున్న చానల్ ఏమని ప్రసారం చేసిందంటే ఇటీవల విశాఖపట్నం జిల్లాలో జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా తలపెట్టిన భారీ బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరవడంతో...సదరు దమ్మున్న చానల్ ఏకంగా జనసునామి అంటూ జగన్ వార్తలు ప్రసారం చేసింది.

విశాఖలో  కోనసాగుతున్న ప్రజా సంకల్పయాత్ర (ఫోటోలు)

ప్రజా సంకల్పయాత్రతో విశాఖలోకి అడుగుపెట్టిన జగన్ కి గ్రేట్ వెల్ కమ్ అందింది. లక్షలాది మంది ప్రజలు జగన్ కోసం తరలివచ్చారు. మొత్తం జనసునామిని తలపించింది. దీనిని సదరు మీడియా ప్రముఖంగా ప్రసారం చేేసింది. పెద్ద హెడ్డింగ్ పెట్టి జగన్ ని ప్రమోట్ చేసింది. దీంతో వైసీపీ అభిమానులు అవాక్ అయ్యారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఎఫెక్ట్ రాజకీయ పార్టీల నే కాకుండా మీడియా చానళ్లు కూడా తాకింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: