తెలంగాణ లో ఎన్నికలు హోరు మొదలవ్వడం తో అన్నీ పార్టీలు తమ వ్యహాలకు పదును పెడుతున్నారు.  రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం  శ్రేణులు పదేళ్లపాటూ అధికారానికి దూరంగా ఉండిపోయాయి. తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అలాంటి దుస్థితి మరో అయిదేళ్లు కొనసాగింది. ఈలోగా పార్టీ మొత్తం తెరాస వారి వలసల వ్యూహాలకు కకావికలం అయిపోయింది. కొందరు కీలక నాయకులు మాత్రమే పార్టీలో మిగిలారు. ఇలాంటి తరుణంలో ఎంత దిగజారి అయినా సరే కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకుని మనుగడ కాపాడుకోవాలనేది వారి ప్రయాస.

Image result for chandra babu

ఈ రెండు పార్టీలు ఇలాంటి పరిస్థితిలో ఉండగా.. ప్రచారంలో ఎవరెంత శ్రద్ధ పెడుతున్నారనేది కీలకం. ఒకవైపు భారతీయ జనతా పార్టీ మాత్రం పూర్తిస్థాయిలో ప్రచారం హోరెత్తించి లబ్ది పొందాలని చూస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించి దాదాపు 50 ప్రచార సభలు నిర్వహించాలనేది వారి ఆలోచన. ఈ ఎన్నికలను పూర్తిగా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా పర్యవేక్షించబోతున్నారు. ప్రచారంలో గరిష్టంగా పాల్గొంటారు.

Image result for chandra babu

భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ముఖ్యమైన వారందరినీ కూడా ప్రచారంలో పాల్గొనేలా చూడాలని అనుకుంటున్నారు. యూపీ, గుజరాత్ సీఎంలు తప్పక ప్రచారంలో ఉంటారని కూడా అనుకోవచ్చు. ప్రధాని మోడీ కూడా కొన్ని సభలు నిర్వహిస్తారు. భాజపా సీఎంలు ఇందరు వస్తుండగా.. పొరుగున ఉన్న ఏపీ సీఎం మాత్రం.. తాను రానని అంటున్నారట. ప్రచార సభలకు నాకు ఖాళీ లేదు అని బాబు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. నిజానికి బాబు తెలంగాణలో ప్రచారం అంటే భయపడుతున్నారని పలువురు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: