దారికి రాని ప్ర‌తిఫ‌క్ష కాంగ్రెస్ నేత‌ల‌ను లొండ‌దీసుకునేందుకు అధికార‌ టిఆర్ఎస్ పార్టీ పావులు క‌దుపుతోంది. అందులో భాగంగానే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి)ని టాస్క్ ఫోర్సు  పోలీసులు సోమ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత‌ అరెస్టు చేశారు. సంవ‌త్స‌రాల క్రితం మాన‌వ అక్ర‌మ ర‌వాణా కేసులో జ‌గ్గారెడ్డి పాత్రుంద‌నే ఆరోప‌ణ‌ల‌పై పోలీసులు ఇపుడు అరెస్టు చేయ‌టం విచిత్రంగా ఉంది. 


జ‌గ్గారెడ్డి అడ్డు తొల‌గించుకోవ‌ట‌మేనా ?


ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌ధ్యంలో  ప్ర‌తిప‌క్షాల్లోని బ‌ల‌మైన నేత‌ల‌ను టిఆర్ఎస్ లోకి  చేర్చుకోవాల‌ని కెసిఆర్ నిర్ణ‌యించారు. అయితే, కెసిఆర్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు లొంగ‌ని నేత‌ల‌ను, రేప‌టి ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ ఇస్తార‌ని నేత‌ల‌ను గుర్తించిన‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే ఏదో ఓ కార‌ణంతో వారి అడ్డు తొల‌గించుకోవాల‌ని అధికార‌పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే నిజామాబాద్ లోని  బాల్కొండ నియోజ‌క‌వర్గం మాజీ ఎంఎల్ఏ, మాజీ స్పీక‌ర్ కెఆర్ సురేష్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. 


ఆక‌ర్ష్ ప‌నిచేయ‌లేదా ?


అయితే, జ‌గ్గారెడ్డిపై ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప‌నిచేసిన‌ట్లు లేదు. అందుక‌నే ఎప్పుడో 2004 కేసును చూపించి ప్ర‌భుత్వం ఇపుడు అరెస్టు చేసింది. అప్ప‌ట్లో గుజ‌రాత్ కు చెందిన ముగ్గురిని భోగ‌స్ ప‌త్రాల‌తో అమెరికాకు పంపిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. జ‌గ్గారెడ్డిపై ఆరోప‌ణ‌లు నిజ‌మే అయితే, త‌గిన ఆధారాలుంటే అధికారంలో ఉన్న నాలుగున్న‌ర సంవ‌త్స‌రాలు ప్ర‌భుత్వం ఏం చేస్తున్న‌ట్లు ? స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందే ఆ కేసులో క‌దిల‌క ఎందుకొచ్చింది ? అంటే రేప‌టి ఎన్నిక‌ల్లో జ‌గ్గారెడ్డిని పోటీ చేయ‌కుండా అడ్డుకునే వ్య‌వ‌హార‌మే క‌న‌బ‌డుతోంది. మ‌రి చూడాలి ఏం జ‌రుగుతుందో. 


మరింత సమాచారం తెలుసుకోండి: