గత కొంత కాలంగా భారత దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి.   ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా..రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.  ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  నిన్న హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదాల విషయం మరువక ముందే ఈ రోజు జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  


జగిత్యాల జిల్లా కొండ గట్టు వద్ద ఘోర్ రోడ్డు ప్రమాదం జరిగింది.   ఘాట్ రోడ్డు లో ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.  బస్సు ముందు భాగం తీవ్రంగా ధ్వంసం అయ్యింది. కాగా బస్సులో దాదాపు 60 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.  బస్సు ప్రయాణిస్తున్న సమయంలో బ్రెకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిందగని అక్కడి వారు అంటున్నారు..విషయం పై ఇంకా సమగ్ర నివేదిక రావాల్సి ఉంది. 


బాధితులను బయటకు తీయడానికి విశ్వప్రయత్నం చేస్తున్న స్థానికులు.  ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది.  పలువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరగగానే ఆ ప్రాంతమంతా వృద్ధులు, పిల్లలు, మహిళల రోధనలతో మార్మోగిపోయింది.   ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే జగిత్యాల ఎస్పీ, కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.  ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: