జనసేనాని పవన్ కళ్యాణ్ రాటుదేలిన రాజకీయమే చేస్తున్నారు. నాడు ప్రజారాజ్యంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యర్ధుల నోళ్ళు మూయించే విధంగానే తన విధానాలకు పదును పెడుతున్నారు. రేపటి ఎన్నికలలో గెలిచేందుకు తగిన వ్యూహాలను పకడ్భందీగా అమలు చేస్తున్నారు.


పితానికి ఫస్ట్ :


జనసేనాని తొలి టికెట్ ను ఏరి కోరి బీసీకే ఇచ్చారు. ఆ విధంగా బీసీల పక్షపాతిగా రుజువు చేసుకున్నారు. ఏపీలో టీడీపీకి బీసీల పార్టీగా పేరుంది. ఆ ఓట్లను మళ్ళించుకోవడంతో పాటు తమ పార్టీపై ఉన్న కులం ముద్రను చెరిపేసుకుందుకు పవన్ ఈ విధంగా చేశారు. తొలి టికెట్ ని బీసీలకే  ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం అభ్యర్ధిగా పితాని బాలక్రిష్ణను డిక్లేర్ చేస్తూ పవన్ షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు.


దూకుడేనా :


వైసీపీ నుంచి జనసేనలోకి షిఫ్ట్ అయిన పితానికి టికెట్ ఖరార్ చేయడం ద్వారా గోదావరి జిల్లాలకు పవన్ గట్టి సంకేతాన్ని పంపించారు. కాపులకు, బీసీలకు అక్కడ పడదన్న సంగతి విధితమే ఈ నేపధ్యంలో కాపుల నాయకుడిని తాను కాదని అందరి వాడినన్ని చెప్పుకునేందుకు పవన్ ఈ ఎత్తుగడ వేసారని అంటున్నారు. మొత్తానికి ఏపీలో ఫస్ట్ టికెట్ జనసేన ప్రకటించి అన్ని పార్టీలకు షాక్ ఇచ్చింది. అంతే కాదు బీసీకే టికెట్ ఇవ్వడం ద్వారా సవాల్ కూడా విసిరింది. మరి దీనిని మిగిలిన పార్టీలు ఎలా తీసుకుంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: