కేసీఆర్ తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు తో పాటు అభ్యర్థుల జాబితా ను కూడా తయారు చేశాడు అయితే ఈ జాబితా తయారీ లో కేటీఆర్ ముఖ్య పాత్ర వహించినాడని తెలుస్తుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన తరువాత అభ్యర్థులను ఎంపికచేసే కీలక బాధ్యత కుమారుడికీ పంచారు. ఈ పనిలో వీరిద్దరూ తప్ప మరొకరికి అవకాశం ఇవ్వలేదు. విధేయత, విశ్వసనీయత, సమర్థత అనే  అంశాల  ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక జరిగింది.

కేటీఆర్‌ కొన్నినెలల నుంచి క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి, విశ్లేషించారు. కేసీఆర్‌ సర్వేలు జరిపినా, ఇంటలిజెన్స్‌ ద్వారా సమాచారం సేకరించినా, కేటీఆర్‌ తన సొంత మార్గాల ద్వారా సమాచారం సేకరించి తండ్రికి సహకరించారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఆయన కొన్ని నెలలపాటు పనిచేస్తూ వచ్చారు. పార్టీ పట్ల ఎక్కువగా ఉన్నవారికే టిక్కెట్లు ఇచ్చారు. విధేయతగా ఉండటమంటే కేవలం అధినేత కేసీఆర్‌కు మాత్రమేకాదు, కేటీఆర్‌ పట్ల కూడా విధేయతగా ఉన్న వారికే ప్రాధాన్యం ఇచ్చారు. కేటీఆర్‌ ఏనాటికైనా కాబోయే ముఖ్యమంత్రని అనుకుంటున్నారు.

కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే తప్పనిసరిగా కేటీఆర్‌కే పగ్గాలు ఇస్తారనేది వాస్తవం. ముందస్తు ఎన్నికలు ముగిశాక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా ఆశ్చర్యంలేదు. ఆయన చర్యలు అనూహ్యంగా ఉంటాయి కదా. అందుకే కేటీఆర్‌ పట్ల అత్యంత విధేయంగా ఉన్నవారినే అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఒకవేళ అనుకోని విధంగా హంగ్‌ అసెంబ్లీ ఏర్పడినా పార్టీని వదలకుండా పూర్తిగా మద్దతు ఇస్తారునుకున్న వారిని బరిలో నిలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: