కేసీఆర్ కు వ్యతిరేకంగా కోదండరామ్ పార్టీ పెట్టిన సంగతీ తెలిసిందే. అయితే కోదండరాం కొత్త పార్టీలో కూడా టికెట్ల అమ్మకం ప్రారంభమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధినేతకు తెలిసి జరిగిందో తెలియక జరుగుతుందో తేలలేదు కానీ టికెట్ల లొల్లి మాత్రం వీధిన పడింది. పార్టీ పుట్టుక నుంచి ఉన్న మహిళా ప్రొఫెసర్ జ్యోత్స్న రోడ్డెక్కారు. కోదండరాం పరువుని బజారుకీడ్చారు. పార్టీ సీనియర్ నేత కపిలవాయి దిలీప్ కుమార్ పై ఆమె సూటిగా ఆరోపణలు చేశారు.

Image result for kodandaram

టికెట్ ఆశిస్తున్నవారి దగ్గర నుంచి పార్టీకి చెందిన వసూలు రాజాలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, పార్టీ కోసం నిజంగా పనిచేసే వారికి విలువ లేదని ఆమె తన ఆక్రోశం వెళ్లగక్కారు. అంతటితో ఆగకుండా ఈ విషయాలను బైటపెడతానన్నందుకు తనపై దాడికి యత్నించారని, తనను, తన భర్తను చంపాలని చూస్తున్నారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇక అసలు విషయానికొస్తే.. ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్నతెలంగాణ జనసమితి ఆవిర్భావం నుంచి కోదండరాంతో కలసి ప్రయాణం చేస్తున్నారు. టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మీడియాలో బలంగా తన వాణి వినిపిస్తున్నారు.

Image result for kodandaram

నిరసనలు, ధర్నాలు, టీవీ చర్చలతో బాగా పాపులర్ అయ్యారు. కోదండరాం తర్వాత పార్టీలో చెప్పుకోదగ్గ నేతగా ఆమెకు పేరుంది. ప్రస్తుతం ఆమె అంబర్ పేట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటోంది. అయితే పార్టీలో లుకలుకలు ఏం జరిగాయో కానీ సడెన్ గా ఆమె విమర్శలు, ఆరోపణలు స్టార్ట్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలంగాణ జనసమితి పరువు బజారుకీడ్చారు. సీనియర్ నాయకుడు దిలీప్ కుమార్ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆమె ఆరోపించారు. తన దగ్గర నుంచి కూడా 2 లక్షలు తీసుకున్నారని, తిరిగి ఇవ్వమని అడిగితే పార్టీ ఫండ్ కోసం తీసుకున్నామని చెబుతున్నారని విమర్శించారు. కోదండరాం ఆశయాలకు విరుద్ధంగా జనసమితిని ఓ బిజినెస్ సెంటర్ లా దిలీప్ కుమార్ మార్చేశారని జ్యోత్స్న ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: