2014 లో అన్నీ అనుకున్నట్టు జరిగి ఉండి ఉంటే జగన్ సీఎం అయిఉండేవాడు. అయితే వైసీపీ పార్టీ అతి విశ్వాసమే తమ కొంప ముంచిందని తరువాత గానీ ఆ పార్టీ కి జగన్ కు బోధ పడలేదు. ఎలాగూ గెలిచేస్తున్నాం.. అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయి గత ఎన్నికల్లో వైసీపీ వర్గాలు గత ఎన్నికల సమయంలో ఓట్లను కూడా సరిగా అడగలేదు. అందరూ తమకే వేసేస్తున్నారు ఇక ఎందుకు అడగడం అన్నట్టుగా కొంతమంది నేతలు ప్రవర్తించారు.

Image result for jagan ysrcp images

దీంతో మొత్తానికే తేడాకొట్టేసింది. పోల్ మేనేజ్ మెంట్ అంటే ఏమిటో ఈ పాటికి అయినా వైకాపాకు అర్థమై ఉండాల్సింది. తన పార్టీ నేతలకు జగన్ ఈ విషయంలోనే తదుపరి బాధ్యతలను అప్పగించినట్టుగా ఉన్నాడు. ఇక వైసీపీ ఇళ్లు మరిచిపోకుండా గమనించుకోవాల్సిన మరో విషయం ఓటర్ల జాబితా. ఈ మధ్యనే ఆ పార్టీ ఈ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ సానుభూతి పరుల ఓటర్లను తొలగించేశారని.. ఒక్కో నియోజకవర్గంలో కొన్ని వేల ఓటర్లను అనర్హులుగా ప్రకటించారని వైకాపా ఆందోళన వ్యక్తంచేసింది.

Image result for jagan ysrcp images

ఈ విషయమై ఈసీని కూడా కలిశారు. ఈసీ ఏదో సర్ధిచెప్పి పంపించింది. అయితే వైకాపా ఇలాంటి కంప్లైంట్లు చేసి ఊరుకుంటే ప్రయోజనం ఉండకపోవచ్చు. బూత్‌ల వారీగా ఎవరి ఓట్లు ఉన్నాయి, ఎవరెవరి ఓట్లు తొలగింపునుకు గురయ్యాయి? అనే అంశాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఓటు అర్హత ఉన్నా.. వైకాపా సానుభూతి పరులు అని తొలగింపునకు గురి అయిన ఓట్లను తిరిగి చేర్పించుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: