స్వీయ తప్పులు ఎరుగుట పెద్ద విద్య అంటారు. రాజకీయాలకు ఇది బాగా వర్తిస్తుంది. ఎంత సేపూ మేమే తోపు, మాకు తిరుగుండదు అనుకుంటే   బొక్క బోర్లా పడతారు. ఎంత  వూపు ఉన్నా, మరెంత  గాలి ఉన్నా చివరి నిమిషం వరకూ వెనక్కు తగ్గకూడదు, రిలాక్స్ అసలు కాకూడదు, ఇదే అనుభవం నేర్పిన పాఠం.


మారిన జగన్ :


పోయిన ఎన్నికలకూ ఇప్పటికీ జగన్ లో చాలా మార్పు కనిపిస్తోంది. ఆత్మ విశ్వావం ఎక్కడా చెక్కుచెదకపోయినా ఎప్పటికపుడు పరిస్థితులను కూడా గమనం లోకి తీసుకోవడం ద్వారా జగన్ రాటుతేలుతున్నారు. మీరు గెలిచేస్తారు అంటే పొంగిపోవడం లేదు. ఓడిపోతామన్న చోట ఫైటింగ్ స్పిరిట్ వదలడమూ లేదు. ఇది జగన్ లో వచ్చిన కీలకమైన మార్పు.


బాబు ఉన్నాడు :


గత ఎన్నికల్లో జనాన్ని చూసి మురిసిపోయిన జగన్ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడంతో దగ్గరకు వచ్చి ఓడిపోయారు. ఈ సారి అటువంటి పరిస్తి తి రానీయ‌కూడదన్న పట్టుదల ఆయనలో కనిపిస్తోంది. చంద్రబాబుని జగన్ ఏ మాత్రం తక్కువ అంచనా వేయకపోవడం  ఆయనలో కనిపిస్తున్న అతి పెద్ద మార్పు. బాబు ఏమైనా  చేయగలరని జగన్ నోటి వెంటనే మాటలు వస్తున్నాయంటే ఎంత అలెర్ట్ గా ఉంటున్నారో అర్ధమవుతోంది.


తిమ్మిని బమ్మిని చేయగలడు:


చంద్రబాబు తో చాలా జాగ్రత్తగా ఉండాలని జగన్ పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేయడం గమనార్హం. వైసీపీ మీటింగ్ ఏంటి బాబు ప్రస్తావన ఏంటి అని  ఆశ్చర్యపోయినా జగన్ బాబు గురించి కొన్ని మాటలను తన పార్టీ మీటింగులో చెప్పడం విశేష పరిణామమే. బాబుని తేలిగ్గా తీసుకోవద్దంటూ జగన్ ఇచ్చిన వార్నింగులన్నీ అనుభవ సారమేనని అంటున్నారు.


మనకే అనుకూలం :


గ్రౌండ్ లెవెల్లో అంతా మనకే అనుకూలంగా ఉంది. నాకు ఎప్పటికపుడు రిపోర్ట్స్ వస్తున్నాయి. అలా అని మీరంతా రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళిపోవద్దు. ఇప్పటి నుంచి పోలింగ్ అయ్యేంత వరకు అలెర్ట్ గానే ఉండాలి. ప్రతీ ఓటూ మనకు ముఖ్యమేనని జగన్ చెప్పిన తీరు ఆయనలోని రాజకీయ పరిణితిని సూచిస్తోందంటున్నారు. అంతా బాగుందని కూర్చోకుండా జనంతో టచ్ లో ఉండండి. చంద్రబాబు విధానాలను ఎండగట్టండి. ఆ విధంగానే ఆయన పాలనపై పూర్తి వ్యతిరేకతను తీసుకురాగలమని జగన్ పార్టీ మీటింగులో చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: