Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 2:11 am IST

Menu &Sections

Search

"హ్యూమన్ ట్రాఫికింగ్" నిండా ఇరుక్కున్న సంగారెడ్డి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే "జగ్గారెడ్డి"

"హ్యూమన్ ట్రాఫికింగ్" నిండా ఇరుక్కున్న సంగారెడ్డి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే "జగ్గారెడ్డి"
"హ్యూమన్ ట్రాఫికింగ్" నిండా ఇరుక్కున్న సంగారెడ్డి మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే "జగ్గారెడ్డి"
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అసలే అధికార పార్టీ అందునా అత్యంత సమర్ధుడైన నరెంద్ర మోడీని ఏదో వెతికి  "ఢీ" కోడితే ఊర్కుంటాడా?  తిరిగి తలబొప్పికొట్టేలాగా కొట్టకుండా ఉండటానికి ఆయన సౌమ్యుడైన వాజపేయి కాదు. ముదురు మోడీ? యాదృచ్చికంగా డిల్లీ హైకోర్ట్ నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియా కేసుల్లో కాంగ్రెస్ రాజమాత సోనియా గాంధి, యువరాజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధిలకు సంబంధం ఉన్న ₹ 1600 నుండి ₹ 5000 కోట్ల రూపాయల కుంభకోణంతో కూడిన ఇన్-కంటాక్స్ అసెస్స్మెంట్ 2011-12 కేసు ఓపెన్ అయింది.

telangana-news-sangareddy-ex-mla-turpu-jayaprakash

దాంట్లో రాహుల్ సోనియాల ₹ 150 కోట్ల పన్ను లెక్క తప్పు చూపిన జాడలు పుష్కళంగా కనిపిస్తున్నాయి. ఆ నేరం ఋజువైన వార్తలు వస్తూనే ఉన్నయి. దేశవ్యాప్తం గా "రాఫెల్ డీల్ కుంభకోణం" అంటూ రాహుల్ గాంధి రేపిన అంశంపై ఇన్-కంటాక్స్ కుంభకోణంతో నీళ్ళు చల్లింది డిల్లి హైకోర్ట్. నేరాలు స్కాముల సమాహారం కాంగ్రెస్ ఒకరివైపు చూపుడు వేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్లు వారి వైపే చూపిస్తాయనేది కాంగ్రెస్ విషయంలో మరోసారి ఋజువైంది.  

telangana-news-sangareddy-ex-mla-turpu-jayaprakash

అలాగే ఇప్పుడు తెలంగాణాలో తూర్పు జయప్రకాష్ రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డి  మానవ అక్రమ రవాణా"  హ్యూమన్ ట్రాఫికింగ్, 2004 కేసు తిరిగి ఓపెన్ అవ్వటం, అరష్ట్ అవ్వటం, అదీ యాదృచ్చికంగా తెలంగాణా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ముంచు కొస్తున్న మునిమాపు వేళ ఓపెన్ అయింది. కాంగ్రెస్ — టిపిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఇందులో రాజకీయకుట్ర కోణం ఉందని అంటున్నారు. అయితే ఇదంతా  నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా!  అంటూ టిఆరెస్ వాళ్లు కాంగ్రెస్ గత చరిత్ర లను ఉదహరిస్తున్నారు. 


అసలు జగ్గారెడ్డి మానవ అక్రమ రవాణా కేసు కథ:

telangana-news-sangareddy-ex-mla-turpu-jayaprakash

మానవ అక్రమ రవాణా 2004 అంటే 14ఏళ్ల కిందట నమోదైన కేసులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. భార్య పిల్లల పేరుతో ఇతరులను అమెరికా తీసుకెళ్ళి అక్కడ వదిలి వచ్చారనే అభియోగాలపై సోమవారం రాత్రి పఠాన్‌చెరువు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆనంతరం సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తరలించారు. మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టగా 14రోజుల పాటు రిమాండు విధించారు.

telangana-news-sangareddy-ex-mla-turpu-jayaprakash

వివవ‌రాల్లోకి వెళితే:

2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌ సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన కుటుంబానికి నకిలీ పాస్‌ పోర్టులు సంపాదించారు. వాటి ఆధారంగా నకిలీ డాక్యుమెంట్లతో వీసాలు పొంది ముగ్గురినీ తన వెంట అమెరికాకు తీసుకెళ్లారు. వారిని అక్కడ ఉంచి జగ్గారెడ్డి, తిరిగి హైదరాబాద్ వచ్చేశారు.

telangana-news-sangareddy-ex-mla-turpu-jayaprakash

ఈ ముగ్గురు అమెరికాకు వెళ్లి పద్నాలుగు ఏళ్ల‌యినా ఇంతవరకు తిరిగిరాలేదు. దీనిపై అనుమానం వచ్చిన "అమెరికన్ కాన్సులేట్ అధికారులు" ఈ విషయంపై ఆరా తీయాలంటూ నార్త్‌ జోన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులు జగ్గారెడ్డి 2004 లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన సిఫారసుతో ఇప్పించిన పాస్‌ పోర్టుల డాక్యుమెంట్లను పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. అందులో కొడుకు, కూతురు, భార్యపేర్లు ఉన్నా ఫొటోలు మాత్రం వేరేవారివిగా గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తుచేశారు.

telangana-news-sangareddy-ex-mla-turpu-jayaprakash

ఈ విషయాన్ని సికింద్రాబాద్‌ మార్కెట్‌ స్టేషన్ లో, పోలీసులకు ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు.అందులో గుజరాత్‌కు చెందిన ఒక కుటుంబాన్ని అమెరికాకు అక్రమంగా రవాణా చేసినట్టు నిర్ధారణ అయింది. కాగా, ఈ కేసు మరిన్ని మ‌లుపులు తిరుగుతోంది. ఈ కేసుతో ముగ్గురికి సంబంధం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. సంగారెడ్డికి చెందిన జెట్టి కుసుమ కుమార్, నిజామామాద్‌కు చెందిన మధుసూదన్‌ రావు, హైదరాబాద్‌కు చెందిన రషీద్ అనే వ్యక్తులు కూడా జగ్గారెడ్డితో పాటు అమెరికాకు వెళ్లివచ్చా రని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


కొందరు మాజీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కూడా ఈ దందాలో భాగం ఉందనే అనుమానాలను పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. గతంలో 2007 మే 3న తప్పుడు ధ్రువపత్రాలతో పాస్‌ పోర్టులు పొందారనే ఆరోపణలతో అప్పటి ఎమ్మెల్యేలు సోయం బాపూ రావు, కాసిపేట లింగయ్యపై కేసు నమోదైన విషయం తెలిసిందే.  గుజరాత్‌కు చెందిన నలుగురిని అమెరికాకు అక్రమంగా తరలించారని వారిపై కేసు నమోదు చేశారు.


telangana-news-sangareddy-ex-mla-turpu-jayaprakash 

దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులకు జగ్గారెడ్డి తన భార్య, పిల్లలను కాకుండా గుజరాత్‌ కు చెందిన వారిని అక్కడికి తీసుకెళ్లి వదిలి వచ్చినట్లు తేలింది. దీంతో మనుషుల అక్రమ రవాణా కేసులో భాగంగా ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు సోమవారం రాత్రి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు పఠాన్‌ చెరువుకు వచ్చిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు ఇం-పర్సనైజేషణ్ చట్టంకిందకు కూడా వస్తుంది. ఒకరికి చెందిన ఫొటోలను పేర్లను మార్చి వారి స్థానం లో వేరేవారు చేరటం.


నగరంలో నడిరాత్రి మహానాటకం:

telangana-news-sangareddy-ex-mla-turpu-jayaprakash

జగ్గారెడ్డి అరెస్టు విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం అప్రమత్త మైంది. రాత్రి 10.30సమయంలో ఆయను అరెస్టు చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని టీపీసీసీ ఆధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. అరెస్టు విషయం తెలుసుకున్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అటు పోలీసు ఆధికారులతో పాటు, డీజీపీ మహేందర్‌ రెడ్డిని కలిశారు.

 

ప్రజలను భయకంపితులను చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షనేతల అరెస్టులతో రాజకీయ లబ్ధి పొందాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా జగ్గారెడ్డి అరెస్టును ఖండించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. ఇంకా ఎన్నికల సమయం నాటికి ఎంతమంది కాంగ్రెస్‌ పార్టీ ఆభ్యర్థులను అరెస్టు చేస్తారో? అనే అనుమానం వ్యక్తం చేశారు.

 telangana-news-sangareddy-ex-mla-turpu-jayaprakash

దేశంలో రాజకీయ నాయకులందరిపై పదుల సంఖ్యలో కేసులు వున్నాయని, వారందరినీ అరెస్టు చేస్తే జైళ్లు సరిపోవన్నారు (దీన్నిబట్టి చూస్తే మనలని పాలించే వాళ్ళలో నేరగాళ్ళే అధికమన్నమాట)  2004లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైన కేసును ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తిరగ దొడారని, అదే సమయంలో ఇలాంటి కేసులు కేసీఆర్‌, హరీష్‌ రావులపై కూడా వున్నాయని ఆయన గుర్తు చేశారు. వారిని కూడా అరెస్టు చేయాలని ఆయన డిమాండు చేశారు. హరీష్‌రావు కుటుంబ సభ్యులపేర్ల మీద గుజరాత్‌కు చెందిన వారు అమెరికాలో ఇప్పటికీ వున్నారని మరి ఆయనపై కేసును ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.

జగ్గారెడ్డి అరష్టుకు సరైన సాక్ష్యాధారాలున్నాయి: నార్త్‌-జోన్‌ డీసీపీ సుమతి 

telangana-news-sangareddy-ex-mla-turpu-jayaprakash
పక్కా సాక్ష్యాధారాలతోనే జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు నార్త్‌-జోన్‌ డీసీపీ సుమతి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో దర్యాప్తు చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులపేర్లతో నకిలీ పాస్‌-పోర్టుతో అమెరికా వెళ్లినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

 

కుటుంబ సభ్యుల పేర్ల పైన వేరే వారిని ఆయన తీసుకువెళ్లినందుకు మనుషుల అక్రమ రవాణా కేసు నమోదు చేసినట్లు ఆమె వివరించారు. జగ్గారెడ్డి అమెరికా తీసు కెళ్ళినవారు ప్రస్తుతం అక్కడే వున్నారని, వారిని అక్కడికి తీసుకెళ్లేందుకు మనిషికి ₹ 5 లక్షల చొప్పున మొత్తం ₹15 లక్షలను ఏజెంట్‌ నుండి లంచం తీసుకున్నట్లు తేలిందని తెలిపారు.

 

2004లో ఎమ్మెల్యేగా వున్న సమయంలోనే ఈ చర్యకు పాల్పడ్డారని, జగ్గారెడ్డిని అరెస్టు చేసి ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డులు, ఫ్యామిలీ ఫొటోలను స్వాధీనం చేసు కున్నామని వివరించారు. మార్కెట్‌ పోలీసులు, నార్త్‌ జోన్‌ పోలీసులు సంయుక్తంగా కేసు దర్యాప్తు చేసినట్లు డీసీపీ వివరించారు.


సంగారెడ్డి బంద్‌కు పిలుపు – దామోదర రాజ నర్సింహా అరెస్టు 

జగ్గారెడ్డి అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి బంద్‌ కు పిలుపు నిచ్చారు. బంద్‌ లో పాల్గొనేందుకు వెళిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహాను పోలీసులు అరెస్టు చేశారు. జగ్గారెడ్డి అరెస్టు పూర్తిగా అప్రజాస్వామికమని ఆయన అన్నారు. 14సంవత్సరాలుగా లేని ఆరోపణలు, కేసు ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎక్కడి నుండి పుట్టుకు వచ్చాయని ప్రశ్నించారు. సంగారెడ్డి లో బలమైన ఆభ్యర్థిగా వున్న జగ్గారెడ్డి పై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు.

telangana-news-sangareddy-ex-mla-turpu-jayaprakash

telangana-news-sangareddy-ex-mla-turpu-jayaprakash
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాకింగ్ న్యూస్: డికే అరుణ బిజేపిలోకి! కాంగ్రెస్ బుట్ట తెలంగాణా దులిపేస్తుందా!
వివేకా హత్యకు ముందు కుక్క హత్య - అజ్ఞాతవ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్! నిందితులు దొరికినట్లే?
షాకింగ్: పికె సున్నితంగా కొట్తిన దెబ్బ చంద్రబాబు నవనాడులపై తగిలినట్లే? నోటి దూలకు..?
శృంగార దీవిలో ఆంభోది మద్యలో శృంగార రసకేళీ విలాసం
ప్రియాంక గాంధీ వాధ్రా హనుమాన్ ఆలయంలో పూజలు..గంగలో పడవ ప్రయాణం ఎన్నికల జిమ్మిక్స్
మరో ప్రఖ్యాత చానల్ టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే: ఏపిలో వైసిపి ప్రభంజనం
లోకెష్ కోసం మంగళగిరిలో బలహీన అభ్యర్ధిని నిలిపితే పవన్ కళ్యాన్ చరిత్ర హీనుడుగా మిగలటం గ్యారంటీ
"మేం కాదు చంద్రబాబే మా కింద పనిచేశారు-మేమే సీనియర్లం" వదరు బోతుకు సరైన సమాధానం సంచలనం
పాక్ అణ్వా యుధ కర్మాగారంలో ఏం జరుగుతుంది? అంతా అనుమానాస్పదమే!
రాజకీయాల్లో సామాన్యుడు ప్రజలకు మనోహరుడు పారికర్ కన్నుమూశారు
ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత - భారత యుద్దవిమానాల మోహరింపు-మాయమైన పాక్ నౌకాదళం
సర్జికల్ స్ట్రైక్స్-2 తరవాత భారత్-పాక్ మద్య అణుయుద్ధం దాడిని అడ్డుకొన్న అమెరికా!
జనసేన లో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ
“మీ భవిష్యత్తు నా బాధ్యత” అనే బాబు మాటలో విశ్వాసం ఏంత? ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారుల అభిప్రాయం
చైనా ముందు భారత్‌ ను కించపరుస్తున్న కాంగ్రెస్ మిత్రపక్షాలు: సినీనటుడు మాధవన్
ఎవడు పడితే వాడు రావడానికి ఇది పశువుల దొడ్డా! కాదు - కాదు: కేసీఆర్ అడ్డా!!
జ‌గ‌న్ పులివెందుల‌కు షిఫ్ట్ సోష‌ల్ మీడియా  ప్రభావమా?
సుధాకర రెడ్డి తో "క్విడ్ ప్రో కో"! చివరి ఘడియ లో వివేకా లేఖ! అనుమానాలకు అంతముందా?
అటు మమతకు ఇటు సోనియాకు ధారుణమైన దెబ్బ కొట్టిన బిజేపి
ఇద్దరు లెజెండ్స్ కథల తో “ఆర్ ఆర్ ఆర్” పై హోప్స్ తారస్థాయికి!
"వివేకా హత్యపై తక్షణమే సిబీఐ చేత విచారణ జరిపించాలి" వై ఎస్ జగన్మోహనరెడ్డి
వైఎస్ జగన్ తాత, తండ్రి, బాబాయిల హత్య సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబే! విజయసాయిరెడ్డి
About the author