సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఏవిధంగా అదుపు చేస్తుంటారో తెలిసిందే.  కొన్ని సార్లు సిగ్నల్ లైట్స్ ను అనుసరించి వాహనదారులు ముందుకు వెళ్లడమో, ఆగడమో జరుగుతుంది.  వారికి ఫైన్ పడుతుందన్న విషయం తెలిసినా..నిర్లక్ష్యంతో వ్యవహరించడంపై ట్రాఫిక్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.  తాజాగా ట్రాఫిక్ కంట్రోల్ చేసే విధానంలో భువనేశ్వర్ లో ట్రాఫిక్ పోలీసుగా ప్రతాప్ చంద్ర ఖండ్వాల్ కొత్త పద్దతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

వివరాల్లోకి వెళితే.. ప్రతాప్ చంద్ర ఖండ్వాల్ గతకొంత కాలంగా హోంగార్డుగా పనిచేస్తున్నారు.  ఈ మద్య ఆయన ట్రాఫిక్ పోలీసులుగా  నియమితుడయ్యాడు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ట్రాఫిక్ కంట్రోల్ చేయడమంటే చిన్న విషయం కాదన్న విషయం తెలిసిందే.  ట్రాఫిక్ పోలీసుగా కొత్తగా విధుల్లో చేరిన ప్రతాప్ చంద్ర కు ఈ విషయంలో విసిగిపోయాడు..దాంతో ఇక లాభం లేదనుకున్నాడు..డ్యాన్స్ తో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుందని ప్రయత్నించాడు.

నడిరోడ్డు మధ్యలో నిలబడే ప్రతాప్ చంద్ర.. ‘స్టాప్’ చెప్పాలంటే ఓ భంగిమలోను, ప్రొసీడ్ అవమని చెప్పడానికి మరో భంగిమలోను వాహనదారులకు సూచనలు చేస్తాడు.  అయితే ప్రతాప్ చంద్ర వింత విన్యాసాలతో వాహనదారులు అతన్ని చూసి తమ వాహనాలు సిగ్నల్స్ రూల్స్  ప్రకారం నడిపించడం మొదలు పెట్టారు.  ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాలకు చేరడంతో ప్రతాప్ చంద్రపై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: