వైసీపీ లో జగన్ చెప్పిందే ఫైనల్ అంతే కానీ జగన్ కే అల్టిమేట్ జారీ చేస్తే మాత్రం సహించడు. అయితే  చలమలశెట్టి సునీల్.. కాకినాడ ఎంపీ సీటుకు వైకాపా ఇన్చార్జి. ఆయన సీఎం చంద్రబాబును కలిశారని, అక్టోబరు నెలలో తెదేపాలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన వైకాపాను వదలి తెలుగుదేశంలోకి వెళ్లడం అంటే సహజంగానే ఆ అంశం చర్చనీయాంశం అవుతుంది.
Image result for చలమలశెట్టి సునీల్

కాపుల్లో జగన్ పట్ల ఒక విద్వేషాన్ని పాదుగొల్పడానికి అధికార తెలుగుదేశం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. సునీల్ ఫిరాయింపు వారికి మరో ఎడ్వాంటేజీ అవుతుంది. పరిస్థితులు ఇలా ఉండగా.. చలమలశెట్టి సునీల్ అసలెందుకు ఫిరాయిస్తున్నాడు అనే విషయాలు వింటే వింతగా అనిపిస్తుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉంటూ కాకినాడ ఎంపీగా పోటీచేసిన సునీల్ తర్వాతి పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి 2014లో పోటీచేసి ఓడిపోయారు.
Image result for jagan

అప్పటినుంచి ఆయనే నియోజకవర్గ ఇన్చార్జి కాగా, తూర్పుగోదావరి జిల్లా మొత్తం వ్యవహారాల్లో సునీల్ మాటను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శిరసావహిస్తూ పాటిస్తూ వచ్చింది. అయితే తాను ఎంపీగా గెలవాలంటే.. అసెంబ్లీ సెగ్మెంట్లలోని అభ్యర్థులను కూడా మార్చాల్సిందేనంటూ సునీల్, జగన్ వద్ద పట్టుపట్టారు. జిల్లాలోని కాకినాడ సిటీ, పెద్దాపురం, పిఠాపురం, జక్కంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల ఇన్చార్జలను అందరినీ మార్చాల్సిందేనంటూ ఆయన పట్టుబట్టినట్టు సమాచారం. దాంతో జగన్.. ‘ఎమ్మెల్యే సీట్లలో గెలిచే అభ్యర్థులను పెట్టుకోవడం నా బాద్యత. ఎమ్మెల్యేలు గెలవకపోతే.. పార్టీనే దెబ్బతింటుంది కదా.. మంచీచెడూ నేను చూసుకుంటాను. ఆ విషయాల్లో జోక్యం చేసుకోకుండా.. ఎంపీ పనిమాత్రం చూసుకోమని గట్టిగా చెప్పినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: