చంద్రబాబు అంటేనే యూ టర్న్ లకు మారు పేరన్న మాటను జగన్ తన హాట్ కామెంట్స్ తో మరోసారి ఎత్తి చూపారు. పొత్త్లు, విడాకులు ఇలా బాబు రాజకీయ జీవితం మొత్తం నడచిందని సెటైర్లు వేశారు. దేశంలో ఇన్ని రకాలుగా మాటలు, పార్టీలు మార్చిన నాయకుడు ఒక్క బాబేనని జగన్ అన్నారు. రాజకీయల్లో ఉంటే ఇంతగా దిగజారాలా అని ప్రశ్నించారు.


మైనారిటీలకూ మోసం :


ముస్లిం మైనారిటీలను కూడా వదలకుండా మోసం చేసినా నాయకుడిగా చంద్రబాబు  చరిత్రలో నిలిచిపోతారని జగన్ అన్నారు. విశాఖలో జరిగిన ముస్లిం మైనారిటీ ఆత్మీయ సదస్సులో జగన్ మాట్లాడుతూ బాబు మైనారిటీలను ఎలా వంచించారో కళ్ళకు కట్టినట్లు వివరించారు. 1999లో బీజేపీతొ పొత్తు పెట్టుకున్న బాబు  2002లో బీజేపీపై మండిపడ్డట్లు యాక్షన్ చేశారన్నారు.


మళ్ళీ తయార్ :


ఆ తరువాత మళ్ళీ 2004లో అదే బీజేపీతో  పొత్తు పెట్ట్కున్నదీ ఆయనేనన్నారు. అప్పట్లో ఓడిపోయాక బీజేపీతో పొత్తు చారిత్రాత్మక  తప్పిదమని బాబు చెప్పారని గుర్తు చేశారు. 2012లో జరిగిన ముస్లిం ససస్సులోనూ జీవితంలో ఎపుడూ బీజేపీ వైపు చూడనని భారీ స్టేట్మెంట్ ఇచ్చారని జగన్ గుర్తు చేశారు. ఇంతలా చెప్పిన చంద్రబాబే 2014లో మళ్ళీ బీజేపీతో అంటకాగారని జగన్ విమర్శించారు. నాలుగేళ్ళు సంసారం చేసి ఇపుడు విడాకులు అంటున్నారని, బాబు ఇలా ఎన్ని సార్లు మైనారిటీలను మోసగిస్తారని జగన్ నిలదీశారు.


ఏకైక క్యాబినెట్ :


దేశంలో మైనారిటీ మంత్రి లేని ఏకైక క్యాబినెట్ బాబుదేనని జగన్ అటాక్ చేశారు. మైనారిటీలపై ఇపుడు అంత ప్రేమ చూపిస్తున్న బాబు తన మంత్రి వర్గంలో ఎందుకు వారికి చోటు ఇవ్వలేదని జగన్ ప్రశ్నించారు. హామీలు ఇవ్వడం ఆనక మరచిపోవడం బాబు నైజమని జగన్ నిందించారు. మొత్తానికి బాబు భాగోతాన్ని మరో మారు బట్టబయలు చేసి జగన్ షాక్ తినిపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: