ప్ర‌తీదానికి ప్ర‌తిప‌క్షాల‌ను స‌వాలు చేసే తెలుగుదేశంపార్టీ నేత‌లు తాజాగా త‌మ‌కెదురైన స‌వాలుకు మాత్రం తోక‌ముడిచారు. త‌మ స‌వాలుకు స‌మాధానం చెప్ప‌లేక  బిజెపి నేత‌లు పారిపోయార‌ని, వైసిపి నేత‌లు స్పందిచ‌టం లేద‌ని టిడిపి నేత‌లు ఎన్నోసార్లు ఎగ‌తాళి చేశారు. అటువంటిది తాజాగా ఉండ‌వ‌ల్లి  చేసిన స‌వాలుకు స్పందించ‌లేక‌, ఎలా స్పందించాలో తెలీక ప్లానింగ్ క‌మీష‌న్ ఉపాధ్య‌క్షుడు తోక‌ముడిచారు.


ఇంత‌కీ విష‌యం ఏమిటంటే,  మాజీ ఎంపి ప్ర‌ధానంగా పెట్టుబ‌డులు, అధిక వ‌డ్డీకి రాజ‌ధాని బాండ్ల‌ను జారీ చేయ‌టంపై ఆరోప‌ణ‌లు చేశారు. రూ. 18 ల‌క్ష‌ల కోట్ల విలువైన పెట్టుబ‌డులొచ్చాయంటూ చంద్ర‌బాబునాయుడు గ‌తంలో చాలా సార్లు చెప్పుకున్నారు.  పారిశ్రామిక రాయితీల‌పై రాజ్య‌స‌భ‌లో కేంద్ర‌మంత్రి స‌మాధానం ఇస్తున్న స‌మ‌యంలో  ఏపికి ఒక్క ప‌రిశ్ర‌మ కూడా రాలేద‌ని రాజ్య‌స‌భ‌లో టిడిపి స‌భ్యులు ఈమ‌ధ్యే సిఎం ర‌మేష్, సుజ‌నా చౌద‌రి నినాదాలు చేశారు. అదే విష‌యాన్ని ఉండ‌వ‌ల్లి ప్ర‌స్తావించారు. అదే స‌మ‌యంలో పెట్టుబ‌డులు, బాండ్ల జారీపై చ‌ర్చ‌కు తాను సిద్ద‌మంటూ  కుటుంబ‌రావుకు బ‌హిరంగ స‌వాలు విసిరారు.


దానికి స‌మాధానంగా కుటుంబ‌రావు మాట్లాడుతూ, ఎంఓయులు జ‌రిగినంత మాత్రాన పెట్టుబ‌డులొచ్చిన‌ట్లు కాద‌ని చ‌ల్ల‌గా చెప్పారు. చేసుకున్న ఎంఓయుల‌న్నీ పెట్టుబ‌డులొచ్చేస్తాయ‌ని తాము ఎప్పుడూ చెప్ప‌లేద‌ని స‌మ‌ర్ధించుకున్నారు. ఇక్క‌డ విష‌యం ఏమిటంటే ల‌క్ష‌ల కోట్ల విలువైన‌ పెట్టుబ‌డులు వ‌చ్చేసిన‌ట్లు  చంద్ర‌బాబు, లోకేష్, మంత్రులు అబ‌ద్ధాలు చెప్పుక్కున్నంత కాలం కుటుంబ‌రావు నోరెత్త‌లేదు. అంటే వారు చెప్పుకున్న‌వ‌న్నీ అబ‌ద్ధాల‌ని తెలిసీ నోరెత్త‌క‌పోతే ఏమ‌న‌ర్ధం ?  కావాల‌నే జనాల‌ను త‌ప్పుదోవ‌ప‌ట్టించ‌ట‌మే క‌దా ? 


తాము రాసేది అబ‌ద్థాల‌ని తెలిసి కూడా నిసిగ్గుగా అచ్చేసే మీడియా మ‌ద్ద‌తుతో జ‌నాల క‌ళ్ళ‌కు గంత‌లు క‌డుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. త‌మ‌కు స‌వాలు విస‌ర‌టం కాద‌ని ఏ విష‌యంలో ఉండ‌వ‌ల్లికి అనుమానాలు ఉన్నాయో చెబితే స‌మాచారం ఇస్తామ‌ని రిక్వెస్ట్ చేసుకోవ‌టం విడ్డూరంగ ఉంది. అంటే ఎదుటివారికి తాము స‌మాధానం చెప్పుకునే స్దితిలో లేన‌పుడే తోక‌ముడిచేస్తారు. ఇదే కుటుంబ‌రావు బిజెపి రాజ్య‌స‌భ స‌భ్యుడు జివిఎల్ న‌ర‌సింహ‌రావును స‌వాలు చేస్తు ఎంత అస‌హ్యంగా మాట్లాడింది అంద‌రూ చూసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: