చూడబోతే కొన్నేళ్ళు ముందు తెలుగు వారి కళ్ళ ముందే జరిగిన వాస్తవాన్ని తమదైన స్టైల్లో స్వేచ్చాయుత కాల్పనీక  కధతో పూర్తిగా అనుకూలంగా మార్చేయతొన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వినాయక చవితి పండుగ వేళ దగ్గుబాటి రానా చంద్రబాబు గెటప్ లో ఎంటీయార్ పాత్రధారి బాలయ్యతో కలసి ఉన్న స్టిల్ విడుదల చేశారు. ఈ స్టిల్ లో బాలయ్య ఆప్యాయంగా  బాబు భుజంపై చేతులు వేసి కనిపిస్తారు. 


చేదోడు వాదోడుగా :


లేటెస్ట్ గా విడుదల చేసిన స్టిల్ చూస్తే అన్న గారు పార్టీ పెట్టినా రాజకీయం ఏమీ తెలియదని, అప్పటికే పాలిట్రిక్స్ లో బాగా పండిపోయిన చంద్రబాబుని తన పక్కన ఉంచుకోవడం వల్లనే ఆయన సీఎం గా పది కాలాలు మనగలిగారని ఈ బయోపిక్ లో చెప్పబోతున్నారా అన్న సందెహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుచేతనంటే ఈ ఫిల్మ్  మేకర్స్ చంద్రబాబు పాత్ర కోసం సలహాలు తీసుకునేందుకు ఏకంగా బాబు వద్దకే వెళ్ళారు మరి. మరి బాబు ని హీరో గా కాకుండా విలన్ గా చూపించే అవకాశం ఎలా ఉంటుందని అనుకుంటారు. ఎవరైనా అనుకుంటే తప్పులో కాలేసినట్లే.


అది ఒక సన్నివేశం :


84లో అన్న గారు కాంగ్రెస్ కుట్రకు బలైపోతే ఆ టైంలో బాబు రంగ ప్రవేశం చేసి క్యాంప్  రాజకీయలను టీడీపీకే కాదు దేశానికి కూడా తొలిసారి పరిచయం చేశారు. ఆ అనుభవం తరువాత కాలంలో బాబుకు బాగా ఉపయోగపడిదనుకోండి అది వేరే సంగతి. అయితే మొదటి సారి వెన్ను పోటు టైంలో మాత్రం బాబు అన్న గారి పక్కన వుండి అండగా నిలబడ్డారు. మరి దీని వరకూ మాత్రమే సినిమా తీసి వదిలేస్తే మాత్రం చంద్రబాబు హేరోలాగానే కనిపిస్తారు.


అలా చూపించగలరా :


అయితే ఇక్కడ ఇంకా నిజాయతీగా సినిమా తీయగలిగితే మాత్రం బాబు కాంగ్రెస్  లో ఉండి సొంత మామ ఎంటీయార్ మీదనే పోటీ చేస్తానని సవాల్ చేయడం, ఆనక ఓడిపోవడం, అధికారంలోకి వచ్చిన టీడీపీలోకి ఫిరాయించడం వంటివి చూపిస్తే చంద్రబాబు ఏ ఉద్దేశ్యాలతో మామ పార్టీలోకి వచ్చి చేరారో ఇప్పటి జనరేషన్ కి కూడా బాగా అర్ధం అవుతుంది. మరి అంత రిస్క్ చేసేలా  మూవీ టీం లేదన్నది అందరికీ తెలిసిందే. బాలయ్య స్వయాన బాబు వియ్యంకుడు. క్రిష్ ఏకంగా బాబునే సలహాలు అడుగుతూ మూవీ తీస్తున్నారు. ఇక రానా తండ్రి సురేష్ బాబు టీడీపీ అనధికార సభ్యుడన్నది తెలిసిందే. సో ఈ మూవీ లో పేరు ఎంటీయార్ అయినా హీరో మాత్రం చంద్రబాబే. యెనీ డౌట్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: