భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిత్వం అలాగే ఆయన రాజకీయ ప్రయాణం ఒకసారి గమనిస్తే చాలా ఆదర్శవంతంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీలో..సంగ్ కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొనేవారు నరేంద్ర మోడీ. ముఖ్యంగా రాజకీయాలలో ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడంలో... తన వాక్చాతుర్యంతో నే సగం పరువు తీసేసేవారు. ఇంతటి విశిష్టమైన ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడైన నరేంద్ర మోడీ...తన బాల్యం నుండే అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనడం జరిగింది.

Image result for narendra modi

దక్షిణ గుజరాత్‌‌లోని మెహసానా అనే జిల్లాలోని వాద్ నగర్ అనే చిన్న పట్టణంలో 17సెప్టెంబర్ 1950న శ్రీ నరేంద్ర మోడీ జన్మించారు. పుట్టుకతోనే ఒక సంస్కృతిలో పెరిగిన శ్రీ నరేంద్ర మోడిలో దాతృత్వం, దయ, సామాజిక సేవా గుణాలను అలవర్చుకున్నారు. 1960లో భారత్-పాక్ మధ్య జరిగిన యుద్దం సమయంలో కుర్రాడిగా శ్రీ నరేంద్ర మోడీ సైనికులకు వాలంటరీగా పని చేశారు. 1967వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం మొత్తం వరదలతో అతలాకుతలమైనప్పుడు బాధితులకు తన వంతు సేవలను అందించారు.

Image result for narendra modi childhood photo

గుజరాత్‌లో అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ ఆధ్వర్యంలో వివిధ సామాజిక రాజకీయ ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. తన బాల్యం నుంచే శ్రీ నరేంద్ర మోడీ అనేక అసమానతలను, అడ్డంకులను అధిగమించారు. వ్యక్తిత్వ బలంతో, ధైర్యంతో అవకాశాలను సవాళ్లుగా మార్చుకున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం కాలేజీ, యూనివర్సిటీలో చేరినప్పుడు కఠినమైన పోరాటాలు చేయాల్సి వచ్చింది.

Image result for narendra modi childhood photo

కానీ జీవన సమరంలోఆయన ఎల్లప్పుడూ ఒక నిజమైన సైనికుడుగా ప్రవర్తించారు. అడుగు ముందుకు వేసిన తర్వాతా మళ్లీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవడానికి లేదా ఓడిపోవడానికి నిరాకరించాడు. ఇదే ఆయనను రాజకీయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు విధించుకున్న కట్టుబాటు. భారతదేశ సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి కోసం స్దాపించిన సామాజిక సాంస్కృతిక సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో ఆయన పయనం మొదలైంది. దేశం పట్ల నిస్వార్ధ సేవ, సామాజిక బాధ్యత, అంకితభావం, జాతీయతా స్ఫూర్తిని పెంపొందించుకోవడానికి ఇది దోహదపడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: