ప్రస్తుతం ఆ పార్టీలో దీనిపైనే చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. టిక్కెట్ ష్యూర్ అని భావించిన వారి ఆశలూ అడియాశలయ్యాయి. ఇకేముంది ప్రకటిస్తారు, హ్యాపీగా ఉడొంచ్చని సంబర పడిన వాళ్ళకైతే నిద్ర పట్టడం లేదు. ఏమైనా లెక్కలు మారాయా, సమీకరణలు సరిపోలేదా ఇలా సవా లక్ష ప్రశ్నలు, అవే ఆలోచనలతో  ఒకటే కంగారూ. బేజారు. అవుతున్నారు. 


యాత్ర ముగిసింది :


విశాఖ జిల్లాలో దాదాపుగా నెల రోజుల పాటు వైఎస్ జగన్ పాదయాత్ర జోరుగా  సాగింది. అన్ని చోట్లా జనం బ్రహ్మరధం పట్టారు. పూలతో స్వాగతాలు, మంగళ హారతులు ఒకటేమిటి జగన్ కి అపూర్వ ఆదరణే దక్కింది. ఈ జోష్ లో జగన్ ఎక్కడికక్కడ కీలకమైన ప్రకటనలు చేస్తారని ఆశ పడిన వారికి షాక్ తగిలింది. ఆ వూసే లేకుండా తాను అనుకున్న మాదిరిగానే ప్రసంగిస్తూ జగన్ ముందుకు సాగిపోయారు. ఇక నేతలు ఇదే విషయమై తెగ పరేషాన్ అవుతున్నారు. 


టిక్కెట్లు దక్కలేదు :


జగన్ రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూసిన వారంతా టిక్కెట్లు కేటాయించకపోవడం పట్ల ఆందోళన చెందుతున్నారు. తాము ఎంతో కష్టపడి మీటింగులను సక్సెస్ చేశామని, తమకే టిక్కెట్ ఖాయమని ధీమాగా ఉన్నామని, ఇపుడు జగన్ నోటి వెంట ఒక్క మాట కూడా రాకపోవడం నిరాశలో ముంచెత్తిందని వాపోతున్నారు. జగన్ ఆలోచనలు ఏంటో తెలియక వీరంతా కంగారు పడుతున్నారు.
రేపటి రోజున వేరే ఎవరినైనా క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తారేమోనని కూడా భయపడుతున్నారు. మొత్తానికి పదిహేను అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లు జిల్లాలో ఉంటే ఒక్క అభ్యర్ధిని కూడా ప్రకటించకుండా జగన్ జిల్లాను విడిచి వెళ్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: