మన ప్రధాని నరేంద్ర మోడీ గురించి చాలా తక్కువ మాత్రమే ఈ దేశ ప్రజలకు తెలుసు. మోడీలోని లోపలి మనిషి ఎవరికీ తెలియదు, అర్ధం కూడా కాదు. ఆయన నిఖార్సైన దేశ భక్తుడు. భారత మాత పేరు చెప్పగానే ఆయన దేహం పులకరిస్తుంది. గాంధీ పుట్టిన  గుజరాత్ లో పుట్టిన మోడీ చిన్నప్పటి నుంచే సంకల్పబలం బాగా కలిగిన నాయకుడు. ఆయన ఏం చేసినా అందులోఅ దేశ భక్తి  తప్పకుండా కనిపిస్తుంది. దేశం కంటే ఎదీ గొప్పది కాదు అన్నది మోదీ ఎప్పుడూ భావిస్తారు


మానవతావాది :


మోడీ కరడు కట్టిన హిందూ వాది అంటారు. అంతకు మించి ఆయన మానవతావాది. పేదల పట్ల ఆయన తపన ఎన్న తగినది. గుజరాత్ ముఖ్యమంత్రి, దేశ ప్రధానిగా ఆయన తలపెట్టిన అనేక కార్యక్రమాలు బీదవారిని ద్రుష్టిలో పెట్టుకునే చేశారని చెప్పక తప్పదు. ప్రభుత్వాల నిర్వహణా లోపాల వల్ల కొన్ని సక్సెస్ అవ్వొచ్చు, ఫైల్ అవవచ్చు కానీ. మోడీకి పేదల పట్ల ఉన్న  ప్రేమాదరణ మాత్రం ఎప్పుడూ ఓడిపోలేదు. 


దేశం కోసమే :


మోడీ ఆలోచనలు ఎపుడూ దేశం కోసమే సాగుతూంటాయి. ఆయన నిరంతరం దేశ హితం కోసమే పని చేస్తూ వచ్చారు. తన సిధ్ధాంతాల విషయంలో ఎన్నడూ రాజీ పడని మనస్తత్వం మోడీది. అనుకున్నది చేయడంలో ఆయన చూపించిన చొరవ చాల మందికి మొండితనంగా కనిపించవచ్చు కానీ. మోడీ మాత్రం ఏవరేమనుకున్నా తాను అనుకున్న దాని నుంచి వెనక్కు మళ్ళలేదు ఎపుడు.


క్లిష్ట పరీక్షలు :


గుజరాత్ సీఎం గా ఉన్నపుడు గోద్రా అల్లర్ల టైంలో మోడీ అత్యంత క్లిష్ట పరిస్తితిని ఎదుర్కొన్నారు. సొంత పార్టీలోనే ఆయన పట్ల అసంత్రుప్తి ఏర్పడిన సమయమది, రాజీనామా చేయాలని ఇంటా బయటా డిమాండ్ రావడంతో మోడీ పదవి వదిలేందుకే రెడీ అయ్యారు. కానీ మొక్కవోని దీస్ఖ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు కలిగిన మోడీ వదులుకునేందుకు బీజేపీలో మెజారిటీ వర్గం ఒప్పుకోలేదు. కనుకనే ఆయన ఆ తరువాత రోజులలో ప్రధాని గా బీజేపీకి రికార్డ్ స్తాయి మెజారిటీ తెచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: