తెలంగాణ లో ఎన్నికలు జోరు మొదలవ్వడం తో అన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుంటూ సీట్ల పంపకంలో బిజీ గా ఉన్నారు.అయితే  అనధికారికంగా వినిపిస్తున్న వార్తలను బట్టి.. కాంగ్రెస్ పార్టీ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ 90  స్థానాల్లో పోటీ  చేయాలనుకుంటున్నది. అందుకు మిగిలిన పార్టీలన్నీ ఒప్పుకుంటే.. ఇక మిగిలేది 29 మాత్రమే. అందులో తెలుగుదేశానికి 15 మాత్రమే ఇస్తారని చెబుతున్నారు. మిగిలిన 14 సీట్లను తెజస, సీపీఐ తదితర అన్ని పార్టీలకు పంచవచ్చు. ఏమైనా తేడావస్తే కాంగ్రెస్ కొన్ని సీట్లు తగ్గించుకోవచ్చు.

Image result for tdp

ఏ రకంగా చూసినా సరే.. తెలుగుదేశానికి ఈ సీట్ల పంపకం చాలా అవమానకరమైన ప్రతిపాదన అనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతోంది. అయితే వారికి వేరే గత్యంతరం లేదు. 2014లో తెరాస హవా ఊపేసిన ఎన్నికల్లోనే తెలుగుదేశం 15 సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత అంతా తెరాసలోకి ఫిరాయించగా ప్రస్తుతానికి ఇద్దరు మిగిలారు. కాగా, గతంలో గెలిచినన్ని సీట్లు మాత్రమే ఇప్పుడు తెలుగుదేశానికి ఇస్తాం అని కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్నదిట.

Image result for chandrababu

ఏ రకంగా చూసినా సరే.. ఇది తెలుగుదేశానికి సిగ్గుమాలిన బేరం అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. ఆ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కూడా 21 మాత్రమే. 21 గెలిచినోళ్లకు 90 అంటే.. 15 గెలిచినోళ్లకు ఎన్ని రావాలి? కానీ ఈ లెక్కలు మాట్లాడేంత ధైర్యం తెదేపాకు లేదు. ఈ మహా కూటమిలో కాంగ్రెస్ తెదేపా మినహా మిగిలిన చిన్న పార్టీలకు గరిష్టంగా 30 ఇచ్చారని అనుకున్నా... మిగిలిన 90ని కాంగ్రెస్ తెదేపాలు 21:15 దామాషాలో పంచుకోవాలి. కొంచెం అటు ఇటుగా కాంగ్రెస్ 55 తెదేపాకు 35 స్థానాలు వస్తాయి. కానీ కాంగ్రెస్ ఇచ్చే ఉద్దేశంతో లేదు.. తెలుగుదేశానికి వేరే గతిలేదు.. ఇక పరువు పోకుండా ఏం జరుగుతుంది?

మరింత సమాచారం తెలుసుకోండి: