అనూహ్యంగా ఎప్పుడో పెట్టిన కేసు కు సంభిందించి ఇప్పడు చంద్ర బాబుకు అరెస్ట్ వారెంట్ రావడం తో అందరూ ఖంగు తిన్నారు. 2010లో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఓ ఉద్యమం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునే ఎజెండా తెలుగుదేశం నాయకులందరూ చంద్రబాబు ఆధ్వర్యంలో అక్కడకి వెళ్లి నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అప్పట్లోనే వారందరిపై కేసులు నమోదు అయ్యాయి.

Image result for chandrababu

అప్పటినుంచి కేసు విచారణలో ఉన్నదే గానీ.. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నడూ మామూలు నోటీసులు కూడా సర్వ్ కాలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఒకేసారి.. చంద్రబాబు సహా వారందరిపై నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ అయ్యాయి. ముందస్తు నోటీసులు ఏమీలేకుండానే.. ఒకేసారి ఈ నాన్ బెయిలబుల్ వారంట్లు ఏంటంటూ.. తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తిరుమలలో శ్రీవారి సేవలో ఉండగానే.. ఇలా నోటీసులు వచ్చిన సమాచారం ఆయనకు అందిందని చెప్పుకుంటున్నారు.

Image result for chandrababu

అప్పట్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది.. బాబ్లీ నిర్మాణాన్ని అడ్డుకోడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ.. చంద్రబాబు నాయుడు ఓ పొలిటికల్ పోరాటం నడిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఉంది. కేంద్రంలోని భాజపాతో సున్నం పెట్టుకున్న నేపథ్యంలో తనమీద కక్ష సాధింపునకే ఇలా అరెస్టు వారంట్లు ఇచ్చారంటూ ప్రచారం చేయడానికి చంద్రబాబు అండ్ కో సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వారంట్ల దెబ్బకు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: