దేశంలో రాజకీయం నానాటికీ తీసికట్టుగా మారుతోంది. జాతీయ పార్టీలు అని చెప్పుకుంటున్న వాటికి జాతీయ విధానం అంటూ లేకుండా పోతోంది. ఎక్కడికక్కడ తాళం వేస్తూ పబ్బం గడుపుకోవడమే ఈనాటి రాజకీయం అయిపోయింది. దాంతో ఏ రోటి కాడ ఆ పాట పాడడం అలవాటైపోయింది. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలూ అదే సూత్రాన్ని నమ్ముకుంటున్నాయి. దాంతో జాతీయ భావన అన్నది లేకుండా పోతోంది.


అక్కడ స్వీట్ :


తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ మహా కూటమి పేరిట కేసీయార్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్, సీపీఐ, తెలుగుదేశం జత కలిసాయి. నిజానికి ఏపీలో సీపీఐ టీడీపీని ఓ రేంజిలో తిడుతూ జనంలోకి వెళ్తోంది. ఆ పార్టీ ఇక్కడ జనసేన, సీపీఎం తో కలసి రాజకీయాలు చేస్తోంది. మరి తెలంగాణాలో మాత్రం టీడీపీ, సీపీఐ కలసిపోయాయి. ఇదేమి  నీతో ఆ రెండు పార్టీలే చెప్పాలి.


ఆ పార్టీతోనూ:


తెలంగాణా ఎన్నికల్లో మరో విశేషం ఏమిటంటే టీడీపీ పుట్టిన నాటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న కాంగ్రెస్ తో అంటకాగడం. ఇది నిజంగా దిగజారుడు రాజకీయాలకే పరాకాష్ట. తెల్లారి లేస్తే కట్టు బట్టలతో పంపించారు. అడ్డ గోలు విభజన చేశారు అంటూ గొంతు చించుకునే టీడీపీ పెద్దలు కాంగ్రెస్ తో అక్కడ చెలిమి ఎలా చేస్తున్నారో ఎవరికీ అర్ధం కాదు. ఇలా సిద్ధాంతాలు లేని పొత్తులు రేపటి ఎన్నికల్లో ఏపీలోనూ చూడబోతున్నామని అపుడే సంకేతాలు కూడా ఇస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: