చంద్రబాబుకు ఏపీ రాజకీయాలలో మరో శత్రువు జత చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ శత్రువు అలాంటి ఇలాంటి వారు కానే కాదు. బాబు దగ్గర ఉన్న పట్లు, గుట్లూ  అన్ని తెలిసి ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టే ఘనమైన శత్రువు. ఆయన స్కెచ్ గీసి గురి పెట్టారంతే కూసాలు కదిలిపోతాయి. మరి ఆ శత్రువు ఇపుడు ఏపీ పాలిటిక్స్ పైన ఓ కన్నేశారంటున్నారు.


దెబ్బకు దెబ్బ :


ఓ ముతక సామెత ఉంది. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ  ఇంటికి ఆ ఇల్లు అంతే దూరమని. రాజకీయల్లో ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. విషయానికి వస్తే చంద్రబాబు మీద తెలంగాణా సీఎం కేసీయార్ మండిపోతున్నారని టాక్. తన ఇలాకాలోకి వచ్చి సవాల్ చేయడమే కాదు. ఓడించేందుకు ఎత్తులు జిత్తులు వేయడాన్ని కేసీయార్ సీరియస్ గానే తీసుకున్నట్లుగా అంటున్నారు. అందుకే దెబ్బకు దెబ్బ తీయాలని డిసైడ్ అయిపోయరని టాక్.


కూటమి పాలిటిక్స్ :


మహా కూటమి పేరుతో తెలంగాణాలో చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలపడాన్ని కేసీయార్ తీవ్రంగానే పరిగణిస్తున్నారు. టీడీపీ ఈ టైప్ లో ట్విస్ట్ ఇస్తుందని ఆయన సహించలేకపోయారు. అన్న పెట్టిన పార్టీ కాంగ్రెస్ తో చేతులు కలపడం అసంభవం, మరి దాని సంభవం చేసి బాబు కేసీయార్ మీద ప్రయోగిస్తే చూస్తూ ఊరుకుంటారా. అందుకే బాబుకు కూడా బ్రేకులు వేయాలని అనుకుంటున్నట్లు భోగట్టా.


ఏపీలో రెడీ :


తెలంగాణా ఎన్నికలు పూర్తయిన తరువాత ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కేసీయార్ స్వయంగా వచ్చి బాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని టాక్. ఇక్కడ బాబు మీద బస్తీ మే సవాల్ అంటున్న వైసీపీకి మద్దతుగా ఏపీలోనూ కూటమి రాజకీయాలకు కేసీయార్ తెర తీస్తారని అంటున్నారు.
బాబు అసలు నైజాన్ని జనాలకు చెప్పడంతో పాటు, ఏపీకి ఎలా నష్టం టీడీపీ చేసిందో కూడా వివరించే ఘాటు  ఉపన్యాసాలతో కేసీయార్ రెడీ అవుతారట. కేసీయార్ కి ఏపీలోనూ విశేషంగా అభిమానులు  ఉన్న సంగతి తెల్సిందే. ఆయన ప్రసంగాలకు మంచి ఆదరణ కూడా ఉంది.  మొత్తంగా చూస్తే బాబుకు చుక్కలు చూపించేందుకు కేసీయార్ సిధ్ధమైపోతున్నారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: