తొందర పడి ఒక కోయిల ముందే కూసిందన్నట్లుగా కొన్ని సార్లు  ప్రీ ప్లాన్స్ కూడా దెబ్బ తీస్తుంటాయి. అయితే అప్పటి పరిస్తితుల బట్టి అలా చేసినా ఏది ప్రస్తుతమో అది చేసేందుకు కూడా సిధ్ధం కావాలి. ముఖ్యంగా రాజకీయ జీవులకు సమయం, సందర్భం చాల ప్రధానం. నాయకులు చెప్పే ప్రతి మాటా రికార్డ్ అవుతుంది, వారి నుంచి జనం ముందు నోటి మాటనే ఆశిస్తారు,  తక్షణ్ హామీలు ఇస్తేనే వారికి హ్యాపీగా ఉంటుంది.


ఆ విషయంలో బాబు జోరు :


ఏపీలో పాలిటిక్స్ ఓ రేంజిలో సాగుతోంది. అధికార టీడీపీకి గండర గండడు చంద్రబాబు నాయకత్వం వేయి ఏనుగుల బలం. బాబు ఎప్పటికపుడు తగినట్లుగా వ్యూహాలు రూపొందిస్తారు. నిన్నటిని అక్కడే వదిలేసి ఇవాళ ఏం చేయాలన్నదే చూస్తారు. అందుకే ఆయన పాలిటిక్స్ లో బాగా సక్సెస్ అవుతున్నారు. మరి జగన్ తీరు చూస్తే భిన్నంగా ఉంది. చెప్పిన మాటకు కట్టుబడిపోతానని అంటున్నారు. ఇది వినడానికి బాగానే ఉన్న ఇప్పటి రాజకీయాలకు ఏమంతా సూట్ అవదని సొంత పార్టీలోనే భిన్న వాదనలు వస్తున్నాయి.


హామీలు ఇవ్వనంటున్న జగన్ :


జగన్ తన పార్టీ తరఫున 2017 ప్లీనరీ సందర్భంగా నవ రత్నాలు అంటూ  తొమ్మిది హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వీటిని కచ్చితంగా అమలు చేస్తామని జగన్ చెబుతున్నారు. తమ ఎన్నికల ప్రణాలిక కూడా కేవలం రెండు పేజీలో ఉంటుందని అంటున్నారు. ఇంతవరకూ బాగానే  ఉంది. కానీ ఆ తరువాత పాదయాత్ర ప్రారంభించిన జగన్ ఎక్కడా కొత్త హామీ ఏదీ ఇవ్వకుండానే సాగిపోతున్నారు. ఏది ఎవరు అడిగినా నవ రత్నాలే వల్లే వేస్తున్నారు. 


నిరాశలో జనం :


జగన్ ఏపీ ప్రతిపక్ష నాయకుడు. కలసి వస్తే రేపటి రోజున కాబోయే సీఎం. అటువంటి నాయకుని వద్దకు జనం వచ్చినపుడు ఆయన క్లారిటీగా హామీలు ఇవ్వాలనే కోరుకుంటారు. కానీ జగన్ మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. మీకు అండగా ఉంటానని ఒక్క ముక్క చెప్పి ముగించేస్తున్నారు. దాంతో నిరాశతోనే వచ్చిన వారు వెళ్తున్నారు.


రెండింటిలోనూ అదే :


విశాఖలో జగన్ రెండు కీలక సభల్లో పాలుపంచుకున్నారు. ఒకటి బ్రాహ్మణుల సభ. నిజానికి బ్రాహ్మణులు ఇపుడు టీడీపీతో ఉన్నారు. వారిని చీల్చి ఇటు వైపు తిప్పాలని పెట్టిన మీటింగ్ అది. కానీ ఇక్కడ జగన్ కచ్చితమైన హామీ ఇవ్వలేదు. వచ్చిన వారంతా బాధతోనే తిరిగి వెళ్ళారు. 

 అలాగే ముస్లిం మైనారిటీల మీటింగులోనూ జగన్ నవ రత్నాల గురించే చెప్పుకొచ్చారు. దాతో వారు కూడా నిరాశ చెందారు. మ్యానిఫేస్టో  ఎలా ఉన్నా కొత్త హామీలు కూడా జగన్ ఇవ్వాల్సి ఉంటుందని, జనం అలాగే ఎన్నో ఆశ పెట్టుకుని వస్తారని పార్టీ నాయకులు కూడా అంటున్నారు. ఇది ఇలాగే సాగితే రేపటి ఎన్నికల్లో మైనస్ అవుతుందేమోనని కంగారు పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: