2014 ఎన్నికలలో దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించి కేవలం తన పార్టీ,,, బిజెపి పార్టీ బలంతోనే బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నరేంద్ర మోడీ గారు. దీంతో అనతికాలంలోనే ప్రధాని మోడీ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోయింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా భారత్ దేశం పై తన వైఖరి మార్చుకుని భారత్  ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ కి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటూ... నరేంద్ర మోడీ హయాంలో భారత్ కి స్నేహాస్తం అందించింది. భారత్ ప్రధాని అవ్వకముందు మోడీ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి జాతీయ స్థాయిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. మోడీ 2001 అక్టోబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి గుజరాత్ 2001 జనవరిలోని భారీ భూకంపంతో పాటు పలు ప్రకృతి వైపరీత్యాల తాకిడితో విలవిలలాడుతోంది. జాతీయ, అంతర్జాతీయ అనుభవాలను ప్రోది చేసుకున్న శ్రీ మోడీ వాటిని సమర్థంగా ఎదుర్కున్నారు.

Image result for modi

2001 జనవరి భూకంప తాకిడి ప్రాంతాల్లో పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలు సవాల్‌గా నిలిచాయి. భూకంపానికి భుజ్ తీవ్రంగా దెబ్బ తిన్నది. వేలాది మంది మౌలకి సదుపాయాలు లేని పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. దయనీయమైన స్థితిని సంపూర్ణ అభివృద్ధి కిందికి ఎలా మార్చారో నేడు భుజ్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగిస్తూ శ్రీ నరేంద్ర మోడీ అతిపెద్ద దృశ్యానికి సంబంధిచంచిన దృష్టికోణాన్ని కలిగి ఉన్నారు. సమీకృత సామాజిక, ఆర్థిక ప్రగతికి శ్రీ నరేంద్ర మోడీ సామాజిక రంగాలపై దృష్టి సారించి అసమతౌల్యాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఆయన పంచామృత యోజన అనే పంచముఖ వ్యూహాన్ని రూపొందించారు.

Image result for modi

ఆయన నాయకత్వంలో గుజరాత్ విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ వంటి వివిధరంగాల్లో భారీ మార్పులను చూసింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం తనదైన స్పష్టమైన దృష్టికోణంతో విధానపరమైన సంస్కరణా కార్యక్రమాలను ప్రారంభించారు, ప్రభుత్వ పాలనా వ్యవస్థను తీర్చిదిద్దారు. తద్వారా గుజరాత్‌ను సంపన్నమార్గంలో పెట్టారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపలే ఆయన లక్ష్యాలకు, సమర్థతకు గుర్తింపు లభించింది. మోడీ పాలనా సమర్థత, స్పష్టమైన దృక్పథం, వ్యక్తిత్వ పరిపూర్ణత లకు ఆయన నైపుణ్యం తోడై 2002 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయాన్ని సాధించి పెట్టాయి. 182 అసెంబ్లీ స్దానాలున్న గుజరాత్ శాసనసభలో 128 స్దానాలను శ్రీ నరేంద్రమోడీ కైవసం చేసుకున్నారు.

Image result for modi

ఇదే విజయ పరంపర 2007 ఎన్నికల్లో పునరావృతమై మళ్లీ గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. శ్రీ నరేంద్ర మోడీ 2012 సెప్టెంబర్ 17న గుజరాత్ ప్రజలు సేవలో 4000 రోజులు రికార్డును పూర్తి చేశారు. మూడు వరుస ఎన్నికల్లో నరేంద్ర మోడీని గుజరాత్ ప్రజలు ఆశీర్వదించి, అధికారాన్ని కట్టబెట్టారు. 2002, 2007 ఎన్నికల్లో(117 సీట్లు) గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించిన శ్రీ నరేంద్ర మోడీ, 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో(115 సీట్లు) తన జోరును కొనసాగించారు. డిసెంబర్ 26, 2012వ తారీఖున వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగాప్రజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విధంగా గుజరాత్ లో తన సత్తా చాటారు మోడీ.  తద్వారా జాతీయ స్థాయిలో తనకంటూ ఇమేజ్ పరుచుకున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: