సినీ రంగంలోని వారు రాజ‌కీయాల్లోకి రావ‌డం కామ‌నే. కొంద‌రు సొంత పార్టీలు పెట్టుకుని రాజ‌కీయంగా ప‌ట్టు సాధించి రా ష్ట్రాల‌ను పాలిస్తే.. మ‌రికొంద‌రు ప‌ద‌వుల్లోకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ప‌వ‌న్ అభిమా ని, త‌న‌కు ప‌వ‌న్ అంటే ప్రాణం అని చెప్పుకొనే.. ప్ర‌ముఖ నిర్మాత‌గా మారిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ బండ్ల గ‌ణేష్.. కూడా రాజ‌కీయా ల్లోకి అడుగు పెట్టారు. ప్ర‌స్తుతం ముంద‌స్తు ముచ్చ‌ట‌కు తెర‌దీ సిన తెలంగాణ‌లో ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం ప్రాధా న్యం సంత‌రించుకుంది. అయితే, అనూహ్యంగా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆయ‌న అధికార టీఆర్ ఎస్‌ను వ‌దిలేసి కాం గ్రెస్ గూటికి చేర‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీస్తోంది.

Image result for telangana

వాస్త‌వానికి ఆది నుంచి బండ్ల గ‌ణేష్‌కు కాంగ్రెస్ మాజీ నేత, మాజీ మంత్రి, ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న బొత్స స‌త్య‌నారాయ‌ణ‌తో అనుబంధం ఉంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. వీరిద్ద‌రి కుటుంబాల‌కు బంధుత్వం కూడా ఉంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే బండ్ల కాంగ్రెస్ వైపు మొగ్గి ఉంటార‌ని అంటున్నారు. ఇక‌, అదేస‌మ‌యంలో రెండో ఆలోచ‌న కూడా వ‌స్తోంది. కేంద్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచే అవ‌కాశం ఉంద‌ని, ఏదో విధంగా మిత్ర‌ప‌క్షాల‌ను జ‌ట్టుక‌ట్టుకుని కేంద్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటైతే.. త‌న‌కు అన్ని విధాలా లాభిస్తుంద‌ని కూడా గ‌ణేష్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే.. గెలిచిన త‌ర్వాత పార్టీ ఫిరాయించే అవ‌కాశం తెలుగు రాష్ట్రాల్లో కామ‌నే సో.. అందుకే గ‌ణేష్ కాంగ్రెస్‌లోకి చేరార‌ని అంటున్నారు. 


పోనీ.. టీఆర్ ఎస్‌లోకి చేరాల‌న్నా.. అక్క‌డ సీట్లు ఫుల్ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలోనే గ‌ణేష్ వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయాల్లోకి రావ‌డం, కాంగ్రెస్‌లోకి చేర‌డం కూడా జ‌రిగాయ‌ని అంటున్నారు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న‌పై ఐటీ దాడులు పెరిగిన విష‌యం గ‌మ‌నార్హం. కాగా,  బండ్ల గణేష్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో రాహూల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. బండ్ల గణేష్‌తోపాటు టీ పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్‌తోపాటు ఆయా పార్టీల నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇదిలా ఉండగా.. షాద్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండ్ల గణేష్ పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆర్థికంగా చాలా బలంగా ఉన్న గ‌ణేష్ ఎలాగైనా స‌రే ఇక్క‌డ విజ‌యం సాధించేలా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని అంటున్నారు కాంగ్రెస్ ముఖ్యులు.



మరింత సమాచారం తెలుసుకోండి: