ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మ‌హారాష్ట్రలోని ధ‌ర్మాబాద్ కోర్టు బెయిల్ కూడా ల‌భించ‌ని విధంగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు 14మందిపై కేసు నమోదైంది. ఎనిమిది ఏళ్లుగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నా యి.  కేసును కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. మరోవైపు కేసుపై సీఎం చంద్రబాబు న్యాయ సలహాలు తీసుకుంటున్నా రు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి ఏపీ సీఎం చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేయడాన్ని తెలుగు దేశం నేతలు తప్పు బడుతున్నారు. చంద్రబాబుపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కనున్నాయి.

Image result for chandrababu naidu Babli project

వాస్త‌వానికి ప్ర‌జా ఉద్య‌మాలు అంటే..చంద్ర‌బాబుకు కిట్ట‌ని ప‌రిస్థితి అంద‌రికీ తెలిసిందే. ఉద్య‌మాలు, ధ‌ర్నాలు అంటే ఆయ‌న క‌డు దూరంగా ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఏపీలో ఏ చిన్న ఆందోళ‌న జ‌రిగినా కూడా ఆయ‌న అస్స‌లు స‌హించే ప‌రిస్థితి లేదు. ఈ క్ర‌మంలోనే వైసీపీ అధినేత జ‌గ‌న్‌పైనా కేసులు న‌మోద‌య్యాయి. జేసీ దివాక‌ర్ రెడ్డి బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగిన‌స‌మ‌యంలో  నివేదిక‌ను త‌న‌కు ఇవ్వాలని ప‌ట్టుబ‌ట్ట‌డం, కృష్ణా జిల్లా అప్ప‌టి క‌లెక్ట‌ర్ బాబు చేతిలో నుంచి కాగితాల ను లాక్కోవ‌డం వంటి కీల‌క అంశాల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఇక‌, ప్ర‌త్యేక హోదా కోరుతూ.. విశాఖ‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన స‌మ‌యంలో జ‌గ‌న్‌పై కేసులు న‌మోద‌య్యాయి. మొత్తానికి విప‌క్షం ఎలాంటి ఆందోళ‌న చేసినా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డే చంద్ర‌బాబుకు ఇప్పుడు కోర్టు నోటీసులు శ‌రాఘాతంగా మారాయి. 

Image result for chandrababu naidu Babli project

విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144సెక్షన్ ను అదుపులో ఉన్నా పట్టించుకోకపోవడం, వంటి వివిధ కారణలతో చంద్రబాబుపై కేసు నమోదయ్యాయి. ఎనిమిది నెలల క్రితం చంద్రబాబుకు మహారాష్ట్రలోని ఓ న్యాయస్థానం కోర్టుకు హాజరుకాకపోవడంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచీ ఈ వారెంట్ పెండింగ్‌లో ఉంది.

ఇటీవల మహారాష్ట్ర వాసి ఒకరు ఈ నాన్ బెయిల్‌బుల్ వారెంట్‌ను ఎందుకు అమలు చేయడంలేదంటూ పిటీషన్ వేశారు. దీనిని విచారించిన కోర్టు.. తాజాగా నాన్‌బెయిల‌బుల్ వారెంటు జారీ చేసింది.  అయితే, దీనిని కూడా చంద్ర‌బాబు త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్లాన్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ ప‌రిణామాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స‌మాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: