Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Feb 22, 2019 | Last Updated 9:19 am IST

Menu &Sections

Search

ఒక ప్రయాణం మరచి పోలేని వ్యక్తులు ఇద్దరు - రాజకీయ నాయకులు అంతా ఒకటి కాదు

ఒక ప్రయాణం మరచి పోలేని వ్యక్తులు ఇద్దరు - రాజకీయ నాయకులు అంతా ఒకటి కాదు
ఒక ప్రయాణం మరచి పోలేని వ్యక్తులు ఇద్దరు - రాజకీయ నాయకులు అంతా ఒకటి కాదు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నరేంద్ర దామోదర్ దాస్ మోడీ, ఉరఫ్ నరేంద్ర మోడీ - ఈ రోజు కారణమేదైనా ఆయన ఒక సంచలం. భారత ప్రధానిగా ఆయన ఏం చేశారు? ఏం సాధించారు? అనేది చెప్పటం కోసం ఈ వ్యాసం రాయటం లేదు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం రూపు దిద్దుకునే క్రమం లో ఆ వ్యక్తి సమాజం పట్ల తన నేటి దృక్పతం ఎలా ఏర్పరచుకున్నారనేది మన ప్రస్తుతాంశం.

india-news-narendra-modi-sankar-sing-vaghela-leena

"ఒక రైలు ప్రయాణంలో గుర్తుంచుకో వలసిన ఇద్దరు వ్యక్తులు" అంటూ లీనా శర్మ అనే వ్యక్తి రాసిన  కథనం జూన్ 1, 2014 లో ఒక ప్రముఖ దినపత్రికలో పునర్ముద్రితమైనది. వ్యాసాన్ని సంక్షిప్తంగా మీ కందిస్తున్నాను!


 

మా బోగీలోనే ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కూడా పయాణిస్తున్నారు. అయితే వారితో పాటు రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వారి 12 మంది బృంద సభ్యుల ప్రవర్తన భీతిగొలిపింది. మమ్మల్ని బలవంతంగా మా రిజర్వ్ బెర్త్స్ నుండి ఖాళీ చేయించి, నిర్దయగా, రాక్షసంగా ఒక మూలకు తోసేయటమే కాదు మా లగేజీపై కూర్చొని, మాపై అశ్లీల వ్యాఖ్యలు చేస్తున్నతీరు, మాలో ఒక ప్రక్క భయం, భీతి గొలపగా, మరో ప్రక్క మా మనసు ఉద్రేకంతో ఉడికిపోయింది. మిగిలిన ప్రయాణికులు టిటిఈ తో సహా అక్కణ్ణుంచి వెళ్ళిపోగా ఒక చివరన చచ్చీచెడీ, గౌరవం అగౌరవం సరిహద్దు లు చెరిగిపోగా, మాకు రాత్రి గడపటం ప్రళయాంతకం కాగా రాత్రి కాళరాత్రే అయింది. 


ఆ గుండాల చేతిలో మానసింగా మేము తునాతునకలైనా, బౌతికంగా మాత్రం దెబ్బలు తినకుండా ఉదయానికల్లా డిల్లీ చేరు కుని బతికిపోయాం. మా సహచరి స్నేహితురాలు ఎంత మానసికంగా గాయపడిందంటే, ఆ తరవాత రోజు అహమ్మదాబాద్ లో జరిగే శిక్షణ కార్యక్రమాన్ని వదిలేసి డిల్లీలోనే ఉండిపోయింది. నా పరిస్థితి అలాగే ఉన్నా, మరో బాచ్మేట్ నాతో పాటు డిల్లీ నుండి అహ్మదాబాద్ వస్తున్నందున, రైలు ప్రయాణం అంటే భయం ఉన్నా, తప్పించుకోలేక పోయాను.


అంతే కాదు, రిజర్వేషన్ కూడా లేకుండా ఓవర్-నైట్ ప్రయాణమిది, కారణం తగిన సమయం లేకపోవటంలో వెయిట్ లిష్ట్ లో ఉన్నాం. ట్రైన్ ఓవర్-బుక్ అవ్వటంతో - టిటిఈ సహాయం కోరాం. ఆయన మహిళమని అలోచించి గౌరవంగా సహాయం చేయ తలచి ఒక కూపేలో కూర్చొని ప్రయాణించటానికి సర్దుబాటు చేశాడు.


ఒక్కసారిగా ఈ రైలులో కూడా సహ ప్రయాణికుల్ని చూడగానే గుండె ఝల్లుమంది. కారణం వారిద్దరు తెల్లని ఖద్దర్ బట్టలు ధరించటమే కావచ్చు. గత రాత్రి ప్రయాణంలో అనుభవం కావచ్చు.  అలోచిస్తున్న మమ్మల్ని గమనించిన టిటిఈ “వారిద్దరూ మంచి వ్యక్తులు. తరచుగా ఈ మార్గంలో ప్రయాణించే వారే. భయపడనవసరం లేదు" అని అనటంతో కొంత మనసు శాంతించింది.

 

వారిలో ఒకరు నలభైకి పైగా వయసుండి ప్రసన్నమైన సాధారణ ముఖవర్చస్సుతో ఆదరణీయం గా కనిపించారు. మరొకరు నలభైకిలోపు వయసుండి ఆదరణీయంగా కనిపిస్తున్నా ముఖం నుండి ఎలాంటి భావం వ్యక్తంకాలేదు.  అద్భుతం ఏమంటే వాళ్ళు ఇరువురూ పూర్తిగా ఒక మూలకు జరిగి దగ్గరగా కూర్చొని, మాకు కూర్చోవటానికి అను కూలంగా ఏక్కువ స్థలం కేటాయించారు.


అయితే వారు మాతో తమను తాము బిజెపి నాయకులమని వారి పేర్లు చెప్పినా,  సహ ప్రయాణికుల పేర్లు గుర్తుంచు కోవటం అసంభవం కదా! అలాగే మేము అస్సాంకు చెందిన ‘రైల్వే సర్వీస్ ప్రొబాషనర్స్’ అని చెప్పుకొని పరిచయం చేసుకున్నాం.


మేం కాస్త కంఫర్టబుల్ ఫీల్ అవగానే, సంభాషణ చరిత్ర రాజకీయాల వైపు మళ్లింది. నా స్నేహితురాలు ఉత్పలపర్ణ హజారికా, డిల్లి విశ్వ విద్యాలయం నుండి చరిత్రలో పిజి చేశారు  (ఆమె ఇప్పుడు ఎక్జెక్యూటివ్ డైరెక్టర్, రైల్వే బోర్డ్) చాలా తెలివైనది. అందుకే ఆమె చర్చలో చాలా చురుకుగా పాల్గొనగా, నేను అప్పుడప్పుడు మాట్లాడాను. 


చర్చంతా హిందూ మహాసభ, ముస్లిం లీగ్ ఏర్పడటం చుట్టూ తిరిగింది. సీనియర్ పర్సన్ చాలా ఇష్టంతో చురుకుగా చర్చలో పాల్గొనగా, జూనియర్ పర్సన్ మాత్రం నిశ్శబ్ధంగా ఉన్నా, ఆయన చర్చలో మాట్లాడకపోయినా అతని దైహికబాషను బట్టి  అతని మనసంతా చర్చమీద అత్యంత శ్రద్ధ పెట్టినట్లు లీనమైపోయారు.


india-news-narendra-modi-sankar-sing-vaghela-leena

ఇంతలో నేను శ్యాం ప్రసాద్ ముఖర్జీ మరణం గురించి ప్రస్థావిస్తూ,  ఇంకా ఇప్పటికి కూడా చాలామంది ఆయన మరణంలొ మర్మముందని నమ్ముతారని, మీరేమంటారని ప్రశ్నించా?  అతను ఒక్కసారిగా మీకు శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఎలా తెలుసు?" అని అడిగారు సీనియర్ పర్సన్. కొంత ఆశ్చర్యంగా. దానికి నా సమాధానం మా నాన్నగారు కలకత్తా విశ్వవిద్యాలయంలో పిజి చేసేటప్పుడు వైస్-చాన్సలర్ గా ఉండి, అనేక మంది నిరుపేద అస్సాం విద్యార్ధులకు ఉపకారవేతనం ఏర్పాటు చేసినట్లు విన్నాను. ఆయన మరణం 53 సంవత్సరాల అతి చిన్నవయసులో (1954) జరగటం, అది అసహజ మరణమని మానాన్నగారు పలుసార్లు ఙ్జప్తికి తెచ్చుకోవటం బాధపడటం నాకింకా గుర్తేనని చేప్పాను.


అప్పుడా జూనియర్ పర్సన్ ఎక్కడో చూస్తూ గంభీరస్వరంతో, తనలో తాను అనుకున్నట్లు,  "వీళ్ళకి చాలా విషయాలు తెలుసు మంచిదే..." నని అన్నారు.  ఇంతలో సడన్ గా సీనియర్ పర్సన్ "మీరు గుజరాత్ లో మా పార్టీలో ఎందుకు చేరగూడదు?" అని అడిగారు. దానికి "మేం గుజరాతీలం కాదు గదా!" అని నవ్వేశాం. దానికి సమాధానంగా జూనియర్ బలంగా అడ్డుపడుతూ, "అయితే ఏమిటట? మాకైతే ఏ సమస్యాలేదు. మేము టాలెంటును మా రాష్ట్రంలోకి ఎప్పుడూ స్వాగతిస్తాం!" అన్నారు ముఖంలో ఏదో చమక్కు, అయినా ప్రశాంతంగా!

india-news-narendra-modi-sankar-sing-vaghela-leena

ఇంతలో నాలుగు వెజిటేరియన్ తాలీ ఫూడ్ అటండెంట్ మాకు సర్వ్ చేశారు నిశ్శబ్ధంగా భోం చేశాం. పాంట్రి-కార్ వెళ్ళిపోగానే, మా నలుగురికి బిల్ జూనియర్ అతనే పే చేయగా,  మేము మోహమాటంగా "థాంక్ యూ!" అని చిన్నగా చెప్పాం. దాన్ని సంభాషణ కంటే అతి చిన్న విషయంగా కొట్టేశారాయన. ఆయన్ని చూస్తుంటే "తక్కువగ మాట్లాడి ఎక్కువగా వినేతత్వం" ఉన్న అద్భుతమైన తేజస్విగా అనిపించాడు. ఆ ముఖంలోని చమక్కు ఎవరిని ఆకర్షించ కుండా ఉండదు.


ఇంతలో టిటిఈ ట్రైన్ అంతా పాక్ అయింది బెర్తులు కొనసాగించలేనని అన్నాడు. ఆ యిద్దరు ఒక్కసారి గా లేచి నిలబడి  "ఒకే! వి విల్ మానేజ్" అంటూనే ఒక వస్త్రాన్ని క్రింద పరిచేసి మాకు బెర్తులు వదిలేసి నిద్రకు ఉపక్రమించారు.

 india-news-narendra-modi-sankar-sing-vaghela-leena

ఎంత పరస్పర విరుద్ధత! నిన్న రాత్రి ఒక బోగీలో 2 + 12 రాజకీయ నాయకులతో ప్రయాణం పూర్తిగా భయంగా, భీతిగా, రక్షణ లేకుండా సాగితే - నేడు ఇద్దరు రాజకీయ నాయకులతో ఒక కూపేలో ఎలాంటి భయం సంకోచం లేకుండా ప్రశాంతంగా ప్రసన్నంగా సాగింది కదా! అందుకే "మెన్ మాటర్స్"-అంటారు అనిపించింది.


తెలతెలవారుతుండగా ట్రైన్ అహ్మదాబాద్ చేరగానే, సిటీలో మా లాడ్జ్ ఏర్పాట్లు గురించి వాకబ్ చేశారు సీనియర్ పర్సన్ మాకు ఏలాంటి అవసరమున్నా, ఇబ్బంది ఉన్నా, తన స్వగృహ ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పటంలో మా పట్ల ఆయన లోని శ్రద్ద, నిజాయతీ స్వరంలో ద్వనించింది.


జూనియర్ ముఖంలో భావాలు అస్తవ్యస్తంగా ఉన్నా ఆయన " నేనొక సంచారిని. మిమ్మల్ని స్వాగతించటానికి నాకు  సరైన ఏర్పాట్లున్న ఇల్లు లేదు కాబట్టి, ఈ కోత్త స్థలంలో, మీరు చక్కటి రక్షణ యివ్వగల నా మిత్రుని ఆహ్వానం మన్నించండి" అని అన్నారు. వాళ్ళకు కృతఙ్జతలతో - తమకు వసతి సమస్య ఏమీ లేదని చెప్పాం.

india-news-narendra-modi-sankar-sing-vaghela-leena

అయితే ట్రైన్ గమ్యంచేరి ఆగేలోగా, నేను నా డైరీ ఒపెన్ చేసి, వారి పేర్లు అడిగి వ్రాసుకున్నాను. కారణం విశాలహృదయము న్న సహప్రయాణికుల పేర్లు మరచిపోరాదని అనిపించింది. వీళ్ళిద్దరిని చూశాక నిన్నరాత్రి రాజకీయ నాయకులపై ఏర్పరచు కున్న అసహ్యతను బలవంతంగా తుడిచి పెట్టేశాను. "రాజకీయ నాయకులు అంతా ఒకటికాదు" అనుకున్నాం.


వాళ్ల పేర్లు నా డైరీలో ట్రైన్ ఆగే లోగా రాసుకున్నాను - ఒకరు - శంకర్ సిహ్ వాఘెలా - మరొకరు నరెంద్ర మోడీ.   ఈ ఎపిసోడ్ను 1995లో అస్సామీస్ వార్తా పత్రికలో "ఇద్దరు ఎవరో తెలియని, ఏ సంబంధంలేని గుజరాతీ రాజకీయ నాయకులు, తమ అస్సామీ బెన్స్ (సోదరీమణులకు) ఎలాంటి కృతఙ్జతలు ఆశించకుండా, ఉదారంగా తమ ఉనికిని పట్టించు కోకుండా చేసిన సహాయానికి నివాళి" గా అని రాసాను.


ఇది అస్సామీలో రాసినరోజున వీరు అతిత్వరలో  నా ఊహకందని స్థాయికి చేరతారని తెలియదు. అయితే నాకు పెద్ద సర్ప్రైజ్ ఏమంటే 1996 లో శంకర్ సింహ్ వాఘెలా గుజరాత్ ముఖ్యమంత్రి కాగా, నాకు అంతులేని అనందం కలిగింది. ఆ తరవాత 2001 లో నరెంద్ర మోడీ, అదే గుజారాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రికాగానే ఉప్పొంగిపోయే ఆనందం కలిగింది. అప్పుడే నా వ్యాసాన్ని మరో అస్సామీ డైలీ పునర్ముద్రించింది. ఇక ఇప్పుడు నరెంద్రమోడీ ప్రధాని అనగానే ఆనందానికి అవధులే లేకుండా పోయాయి  (ఈ మొత్తం ఎపిసోడ్ ను ది హిందూ తర్జుమా చేసి 2014 జూన్లో ప్రచురించింది)

india-news-narendra-modi-sankar-sing-vaghela-leena
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రతిపక్షాలకు షాకింగ్! జయహో మోడీ! టైమ్స్ ఆన్‌-లైన్‌ పోల్ *పోల్ పీరియడ్ ఫిబ్రవరి 11 టు 20*
పాక్ అమ్మాయి పుల్వామా ఘటనపై "యాంటీ హేట్ చాలంజ్" ఉద్యమం
పాకిస్తాన్ పై భారత్ జలయుద్ధం
జగన్ వ్యూహం మైండ్ బ్లోయింగ్ - ఆ పత్రికాధినేత పెన్నుకు నోటికి రెంటికీ తాళం వేసినట్లేనా?
పాక్ కు షాక్ - దటీజ్ మోడీ - ₹ 7 లక్షల కోట్ల పెట్టుబడులకు సౌదీ నిర్ణయం
ఎడిటోరియల్:   "వాళ్లను చంపేయాలి- భగవద్గీత కూడా చెపుతుంది" బాలిక మనాలి ప్రధానికి లేఖ - బాబు మమతకు పాఠం!
తెలుగుదేశం పార్టీకి తలకొరివి పెట్టేది చింత‌మ‌నేని లాంటివాళ్ళే!
ఉగ్రదాడితో దేశమంతా విషాదం అలుముకున్న వేళ  మోదీ, నితీష్ ముసి ముసి నవ్వులా?
ఎరిక్సన్ కేసులో అనిల్ అంబాని కోర్ట్ ధిక్కరణ-నేరం ఋజువైంది: సుప్రీం కోర్ట్
విశ్వవిజేతలు: రతన్ టాటా-అవమానించిన వారిపై కోపాన్ని, తన లక్ష్యంగా మార్చుకొని మౌనంగా విజయం సాధిస్తారు!
 ఇండియా టుడే సర్వే - దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు!
మేం చేస్తే..సంసారం..ఇంకోళ్లు చేస్తే ఏదో అన్నట్టుంది టీడీపీ వ్యవహారం!
తాను త్రవ్వుకున్న గోతిలో చంద్రబాబు  తానే పడబోతున్నారా!
భారత్ కు ప్రథమ ప్రధాని నెహౄ ఇచ్చిన బహుమతి ఆర్టికల్ 370 - దేశం మెడలో కట్టిన గుదిబండ
కత్రినా! ప్లీజ్! మా సల్మాన్ ను పెళ్ళి చేసుకోవా? ఒక అభిమాని అభ్యర్ధన
"నేను హోంవర్క్ చేయలేదు. స్కూల్-వర్క్‌ ఇంటి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు" ఆ బుడుగు లెటర్ ఈ ప్రపంచానికే షాక్!
రగులుతున్న కాశ్మీరం - పుల్వామా దాడి సూత్రధారిని హతం - తక్షణ ప్రతీకారం తీర్చుకున్న భారత్
"అంత మహనీయుణ్ణి మీ తండ్రి ఎందుకు వెన్నుపోటు పొడిచారు?" లోకేష్ మాట తెచ్చిన చేటు!
అమిత్ షా తో హరీశ్ రావు రహస్య రాజకీయం - రేవంత్ వ్యాఖ్యలు సంచలనం
“ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదలకు ముందే నీరస పడిందెందుకు?
మిస్టర్ శివాజీ! చంద్రబాబు నాడు ఎన్టీఆర్ పై చెప్పులేసిన దానికి నేనే ప్రత్యక్ష సాక్షి
చంద్రబాబు నమ్మకద్రోహ రహస్యం చెప్పిన అత్త: లక్ష్మిపార్వతి
About the author