చంద్రబాబును నిజంగా అరెస్టు చేయాలంటే ఓటుకునోటు కేసులో నోటీసులు రావాలి, పోలవరం  ప్రాజెక్టు గుత్తేదారుకు పనులేమీ చేయకుండానే 112.5కోట్ల రూపాయలు ఇచ్చినందుకు నోటీసులు రావాలి. అలా జరగలేదు అంటే ఇది సానుభూతి కోసం ఆడుతున్న డ్రామాగా గ్రహించండి మిత్రులరా గత నాలుగు నెలల నుండి సినిమా వేషగాడు శివాజీ ఆపరేషన్ గరుడ పెరుగువడ అంటూ హడావుడీ చేస్తున్న స్క్రిప్ట్ వెనుక ఉన్నది పచ్చ డైరెక్టర్లే . అంతా చంద్రబాబు ఆధ్వర్యంలో వ్రాసిన స్క్రిప్ట్..ఇది ఒక సిల్లీ కేసు . 


జిల్లాల స్థాయిలో మండలాల స్థాయిలో పోలీసులు పెట్టే సిల్లీ కేసు ఇది . ఎప్పుడైనా పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు చేసినా , అనుమతి లేకుండా మైకులు పెట్టినా, టైం దాటాక మీటింగ్లు పెట్టినా ఇలాంటి కేసులు పెడతారు. ఇలాంటి కేసులన్నీ పోలీసు స్టేషన్ స్థాయిలోనే కొట్టేస్తారు . సాధారణంగా 500 రూపాయలు పోలీసు స్టేషన్ లో ఫైన్ కట్టి ఇంటికి వెళ్ళిపోతారు . ఇదీ ఈ కేసుకున్న తీవ్రత .  ఇకపోతే ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే  2010లో వచ్చిన ఉపఎన్నికలలో లబ్ధిపొందటానికి మహారాష్ట్రకి వెళ్లి చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్ట్ అడ్డుకోవాలని హడావుడీ చేసాడు. ఆరోజు చంద్రబాబు బృందానికి అనుమతి లేకుండా వెళ్లి అక్కడ పోలీసుల మీద చేయి చేసుకున్నందుకు వాళ్ళు టీడీపీ బృందం మీద న్యూసెన్స్ కేసు పెట్టారు.
Image result for operation garuda
అదే రోజు పోలీసు స్టేషన్ కి వెళ్లి 500 రూపాయలు కడితే కొట్టేసేవాళ్ళు .  కానీ బాబు తెలంగాణ ప్రజలకోసం పోరాడుతున్నట్లు నమ్మించటానికి నాటకం రక్తికట్టాలని అక్కడే కాసేపు బైఠాయించి హడావుడి చేసాడు . కొద్దిసేపటికి ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య ప్రత్యేక విమానం పంపితే దానిలో తిరిగి వచ్చాడు . ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడటంతో  ఇన్నిరోజులుకి ఆ పాత కేసుకి మెరుగులు దిద్ది నాటకానికి తెరలేపాడు .  కేసు ఫైల్ చేసింది - 2010 లో అప్పటినుండీ అక్కడ కోర్టు కూడా పట్టించుకోలేదు . అప్పుడు మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం . ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతున్నాయి. మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తతో ఆరోజు కేసుని మళ్ళీ వెలికితీశారు . అప్పటి నుండీ ఈకేసు మీద ఎందుకు చర్య తీసుకోలేదని చంద్రబాబే స్వయంగా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తతో పిటిషన్ వేయించాడు . 


ఆ పిటిషన్ మీద స్పదించిన కోర్టు టీడీపీబృందం కోర్టులో హాజరు కావాలని  జులై 8వ తారీకు నోటీసు ఇచ్చింది. ఆగష్టు 11 న హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు . ఆరోజు బాబుగారు బిజీగా ఉన్నారని దానిని సెప్టెంబర్ 21 వరకు మార్చారు.  జూలైలో వచ్చిన నోటీసుకి చంద్రబాబు బృందం తరుపున ఒక చిన్న లాయర్ వెళ్లినా కేసు కొట్టేస్తారు . కానీ అలా చేయకుండా దీనిని మోడీమీదకి నెట్టి సానుభూతి పొందటానికి స్కెచ్ వేసాడు. ఇలాంటి కేసులు జిల్లాలు , మండల స్థాయిలో ప్రతిరోజూ పోలీసులు పెడుతూనే ఉంటారు . కోర్టు ఇచ్చిన నోటీసులకు సకాలంలో స్పదించకపోతే ఎవరికైనా నాన్ బెయిల్బుల్ వారెంట్లు జారీ చేయటం సర్వసాధారణం. 

Image result for babli project chandrababu naidu case

ఇందులో కామెడీ ఏమిటంటే మహారాష్ట్రలో బాబ్లీ కట్టింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే , అందులో అప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు . ఆరోజు కళ్ళుమూసుకొని ఎన్నికలలో సానుభూతి కోసం ఇప్పుడు న్యూసెన్స్ కేసుని అడ్డంపెట్టుకొని హడావుడి చేయాలని చూస్తున్నాడు .  అక్కడ  పోలీసులు , కోర్టులు మర్చిపోయిన ఒక సిల్లీ కేసుని తన  మనిషి ద్వారానే కేసుని మళ్ళీ తెరిపించి ఆపరేషన్ గరుడ బెరుడా అని సినిమా వేషగాళ్లతో ప్రచారం కల్పిస్తూ సానుభూతికోసం పడరాని పాట్లు పడుతున్నాడు . 


ఇదే సందర్భంలో మరో కేసులో చంద్రబాబు నైజం ఏమిటో చూడండి !

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజించాలని తెలంగాణా పోరాడుతుంటే  హైకోర్టుని విభజించటానికి వీల్లేదని సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు వేసాడు . ఆ కేసు వాదించటానికి ప్రముఖ లాయర్ ని నియమించి కేవలం ఒక గంటకి 33 లక్షల చొప్పున ప్రజల డబ్బు చెల్లిస్తున్నాడు . దానికోసం రిలీజ్ చేసిన జీవో నంబర్ 259 చూడండి . నారీమన్ అనే లాయర్ ఈకేసుకోసం  కోర్టులో ఎన్ని గంటలు ఉంటే అన్ని సార్లు గంటకి 33 లక్షలు చొప్పున మన చంద్రబాబు ప్రభుత్వం ప్రజల డబ్బు చెల్లించాలి . 

Image result for high court hyderabad

హైకోర్టు విడదీస్తే హైద్రాబాదులో నమోదైన కేసులన్నీ తెలంగాణాకి బదిలీ అవుతాయని , అలా జరిగిన పక్షంలో ఇన్నిరోజులు స్టేలతో నెట్టుకొస్తున్న కేసులలో స్టేలు ఎత్తేసి విచారణకి వచ్చే ప్రమాదమున్నది గ్రహించిన చంద్రబాబు కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద లాయర్లని పెట్టి హైకోర్టుని విభజించటానికి వీల్లేదని పోరాడుతున్నాడు .  నిజంగా చంద్రబాబుని జైల్లో పెట్టాలంటే 20 కేసులున్నాయి . ఆధారాలతో దొరికిన ఓటుకి నోటు కేసు ఉంది . విజయమ్మ గారు వేసిన పిటిషన్లో హైకోర్టు స్వయంగా విచారణకి కూడా ఆదేశించింది . ఆరోజు సిబిఐ ఆఫీసర్ గా ఉన్న కేడీ లక్ష్మినారాయణ సిబ్బంది లేడని తాత్సారం చేస్తే ఈ లోపు చంద్రబాబు స్టే తెచ్చుకొన్నాడు . చంద్రబాబు మీద ఉన్న కేసులలో ఏ ఒక్కదానిమీద స్టే ఎత్తేసినా మిగిలిన శేష జీవితమంతా జైల్లో కూర్చోని ఖైదీలకు తన బుర్రకథ చెప్పుకోవటమే.  తాజాగా ఈ వార్తలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

 — Viral Story from YSRCP Analyst.

మరింత సమాచారం తెలుసుకోండి: