వర్తమాన రాజకీయాలో అవినీతిపరులే ఎక్కువగా కనిపిస్తున్నారు. చిన్న వార్డ్ మెంబర్ గా ఉన్నా కూడా లాగేసుకోవాలని చూస్తున్నారు. అంటువంటిది భారత్ లాంటి సువిశాల దేశానికి  ప్రధాని, ఎంతటి అధికారం చేతుల్లో ఉంటుంది, అయినా ఆయనపై ఒక్క పైసా తిన్నారన్న ఆరోపణ రాలేదంటే మోడీ ది గ్రేట్ అనిపించక మానదు. 


నీతి నిజాయతీ :


మోడీకి నీతి నిజాయతీ పెట్టని ఆభరణాలు అయ్యాయి. చిన్నతనం నుంచే ఆయనకు లభించిన శిక్షణ అటువంటిది. మోడీ తనది కానిదీ ఎన్నడూ ముట్టుకోలేదు. అవినీతి అంటే ఆయనకు తెలియదు. పుష్కర కాలం పైగా అయన గుజరాత్ లాంటి సంపన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినా ఇదే తీరులో ఉన్నారు. నాలుగేళ్ళ ప్రధాని గానూ ఇలాగే వ్యవహరిస్తున్నారు.


ఊకదంపుడు ఆరోపణలు :


నిజానికి మోడీ ప్రభుత్వంపై అదే పనిగా ప్రత్యర్ధి పార్టీలు చేస్తున్నవి ఊకదంపుడు ఆరోపణలు గానే జనం భావిస్తూ వస్తున్నారు. మోడీ అవినీతి చేసేలా ఉంటే ఇప్పటివరకూ ఆగేవారా అన్న తర్కం కూడా చేస్తున్నారు. ఆయన కుటుంబం గురించి ఇంతవరకూ ఎవరికీ తెలిసింది పెద్దగా లేదు. తన పదవిని తానే కాదు కుటుంబ సభ్యులెవరూ వాడుకోరాదన్నది మోడీ విధానం. ఇది నిజంగా గొప్ప విషయం.


బంగ్లాలో ఒకే ఒక్కరు :


ప్రధాని నివాసంలో ఆయన ఒక్కరే ఉంటారు. తల్లిని కానీ, కుటుంబాన్ని కానీ మోడీ తీసుకుని రాలేదు. ప్రధానిగా ప్రమాణం చేస్తున్న టైంలో కూడా తన వాళ్ళెవరూ రాకుండా జాగ్రత్త పడ్డారు. ఫలితంగా ఎన్నడూ లేని విధగ్నా ఒక దేశ ప్రధాని పదవీ స్వీకారాన్ని కుటుంబ సభ్యులు టీవీల్లో సామాన్యుల్లా చూడాల్సి వచ్చింది. మోడీ అన్నదమ్ములు కూడా అతి చిన్న జీవితాన్నే ఈ రోజుకూ గడుపుతున్నారు. ఇలా ఆలోచిస్తే ఇప్పటితరం నేర్చుకోవాల్సింది మోడీ నుంచి ఎంతో ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: